| Daily భారత్
Logo




కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు "బుధవారం బోధన" : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

News

Posted on 2025-10-22 18:44:53

Share: Share


కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు "బుధవారం బోధన" : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలన

డైలీ భారత్, కరీంనగర్: విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలను నేర్పించేందుకు బుధవారం బోధన కార్యక్రమం ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. 

జిల్లావ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం బోధన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పర్యవేక్షించారు. మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

9వ తరగతి విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో పాఠాన్ని చదివిస్తూ స్పష్టంగా అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పారు. ప్రతి విద్యార్థి నోట్ బుక్ లో రైటింగ్ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠినమైన పాఠాన్ని ఎంచుకొని చదవాలని అన్నారు. శ్రద్ధ అంకితభావంతో నేర్చుకోవాలని సూచించారు. బుధవారం బోధన కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్య ఇస్తూ కఠినమైన పాఠాల పట్ల దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

విద్యార్థులతో కలిసి భోజనం

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్ పిల్లలకు కొన్ని సూచనలు చేశారు. కూరలు ఎక్కువగా తినాలని, ఆకుకూరలు, గుడ్లు తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ఏ ఆహార పదార్థాల్లో ఏ పోషకాలు ఉంటాయని విద్యార్థులను ప్రశ్నిస్తూ వారికి వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే కల్పించాలని విద్యాధికారిని ఆదేశించారు. విద్యార్థులు చేతులు కడుక్కునే చోట నల్లాలు లేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రాజేష్, ఎంఈఓ రవీందర్ పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >