Posted on 2025-10-23 17:07:17
అది కాకుండా ఇతర పార్టీలపై విమర్శలు చేయడం మీ అవివేకానికి నిదర్శనం
ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా పాదయాత్ర చేసుకోవచ్చు.. జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రను స్వాగతిస్తున్నాం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీచ రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌వి అర్థం లేని ఆరోపణలని కొట్టిపడేశారు. ఆయన గురువారం నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టారన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పార్టీని భవిష్యత్తులోనూ ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతోందని పీసీసీ చీఫ్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాదయాత్రపై మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రను చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా దోచుకుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అయితే.. గత పదేళ్లలో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాలు కాదా చెప్పాలన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >