| Daily భారత్
Logo




సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

News

Posted on 2025-10-25 16:17:20

Share: Share


సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

అమృత్ 2.0 కు సిరిసిల్ల మున్సిపాలిటీ ఎంపిక

వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:సిరిసిల్ల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ పకడ్బందీగా అమలు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

అమృత్ 2.O పథకం కింద సిరిసిల్ల మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ అమలుకు మొదటి కన్సల్టేటివ్ వర్క్ షాప్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో వివిధ శాఖల అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ,

జీఐఎస్ సాంకేతికత ఆధారంగా బేస్ మ్యాప్స్, ల్యాండ్ యూజ్ మ్యాప్స్, మాస్టర్ ప్లాన్‌లు, అర్బన్ జియో-పోర్టల్ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. ఇప్పటికే సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే పూర్తిచేయడంతో పాటు, సోషియో ఎకమిక్ సర్వే నిర్వహించినట్లు వెల్లడించారు. వివిధ జిల్లా శాఖ అధికారులు సంబంధిత వివరాలు మొత్తం అందజేయాలని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ఆయా శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి పనులకు చేసిన ప్రణాళికల వివరాలు అందించాలన్నారు. మాస్టర్ ప్లాన్ అమలుతో మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం, త్రాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్ వంటి మౌళిక సదుపాయాలు మెరుగుపడతాయని వివరించారు.

వారం రోజుల్లోగా వివిధశాఖల జిల్లా అధికారులు సంబంధిత డేటా, ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనుల వివరాలు అందజేయాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ అమలులో సంబంధిత అధికారులం దరూ భాగస్వామ్యం అవ్వాలని పేర్కొన్నారు.

సమావేశంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జీ ఐ ఎస్ హబ్ డీటీసీపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ అశ్వినీ యాదవ్, డీ టీ సీ పీ వో వరంగల్ ఏడీ జ్యోతి, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, డీటీసీపీవో అన్సారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >