Posted on 2025-10-27 07:52:20
విడుదలైన ఖైదీలు మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జైళ్ళ శాఖ డిజి సౌమ్య మిశ్రా వెల్లడి
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: వివిధ నేరాల కై జైళ్లకు వెళ్లి శిక్ష అనుభవించిన ఖైదీలు వారి మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా స్వయం ఉపాధి అందిస్తూ వారి లో పూర్తి మార్పు కోసమే జైళ్ల శాఖ రాష్ట్రవ్యాప్తంగా 31 పెట్రోల్ బంకులు జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసినట్లు జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా పేర్కొన్నారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా నిజామాబాద్ నగర శివారులోని మల్లారం ప్రాంతంలో జిల్లా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంకును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాజంలో ఎవరు ఒకరు తెలుసో తెలియకో నేరాలకు పాల్పడతారని అందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధిస్తుందని జైలు శిక్షకు గురైన ఖైదీలు వారిలో సత్ప్రవర్తన వచ్చిన వారిని విడుదల అయిన వారికి ఉపాధి కోసం ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పురుషులకు పెట్రోల్ బంకులతో పాటు, మహిళా ఖైదీల కోసం కుట్టుమిషన్లు ఇతర స్వయం ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసి వారికి అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇందుకు గవర్నర్ అనుమతి కావాలని ఒక సందర్భంలో గవర్నెన్స్ ఆమోదం కోసం తాము వెళ్ళినప్పుడు ఖైదీలను విడుదల చేస్తున్నారు కానీ వారిలో సత్ప్రవర్తన రావడం లేదు అని ప్రస్తావించినప్పుడు తనకు ఇలాంటి పునరావాస ఉపాధి కేంద్రాలు ఖైదీలకు అవకాశం కల్పిస్తే వారిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుందని తాను చెప్పడం జరిగినట్లు ఆమె తెలిపారు.ఈ అవకాశాన్ని విడుదలైన ఖైదీలు సద్వినియోగపరుచుకోవాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో టీఎం రిటైల్ బిపిసిఎల్ శ్రావణ్ కుమార్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పర్సన్ వెల్ఫేర్ తెలంగాణ అధికారి మురళి బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ పర్సన్ వరంగల్ రేంజ్ అధికారి సంపత్ సూపరిండెంట్ ఆఫ్ జైల్స్ ఆనందరావు కూన తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >