Posted on 2025-10-28 12:46:32
శాలువా పై మోడీ క్యూఆర్ కోడ్
డైలీ భారత్, కరీంనగర్:సిరిసిల్ల నేత కళాకారుడి నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్ అద్భుతమైన శాలువాను సృష్టించాడు. మోడీ మన నాడీ పేరుతో శాలువా పై ప్రధాని నరేంద్ర మోడీ క్యూఆర్(QR) కోడ్ ను చేనేత మగ్గంపై రూపకల్పన చేశాడు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలుసుకునే విధంగా శాలువా పై క్యూఆర్ కోడ్ ను రూపొందించాడు. ఈ శాలువాను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సాధించిన ముఖ్య విజయాలు, చేపట్టిన ప్రముఖ కార్యక్రమాలు శాలువాలపై నేసి, క్యూఆర్ కోడ్ లో పొందుపరచడానికి విజయ్ ప్రయత్నించాడు.
ఈ స్కానర్ ను స్మార్ట్ ఫోన్ లో కెమెరాతో స్కాన్ చేయగానే అయోధ్య రామమందిరం, ఆపరేషన్ సిందూర్, డిజిటల్ ఇండియా, చంద్రయాన్-3, వందే భారత్ ఎక్స్ప్రెస్, స్వచ్ఛభారత్ వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను కనిపిస్తాయి. ప్రధాని మోడీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ క్యూఆర్ కోడ్ శాలువాను తయారు చేసినట్లు నేత కళాకారుడు విజయ్ తెలిపారు. ఈ శాలువా వెడల్పు 32 ఇంచులు, పొడవు రెండున్నర మీటర్లు, దాని తయారీకి 12 రోజుల సమయం పట్టిందన్నారు. ఈ శాలువాను అతి త్వరలో ప్రధాని మోడీకి అందించనున్నట్లు ఆయన చెప్పారు. కాగా నల్లా విజయ్ గతంలో ఆపరేషన్ సిందూర్ బంగారు శాలువాను మగ్గం పైనేసి మోడీకి అందించారు. ఇలా ఎన్నో ఆయన నుంచి ఎన్నో చేనేత కళ నైపుణ్యాలు ఆవిష్కృతమయ్యాయి.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >