Posted on 2025-10-28 15:09:42
కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో
డైలీ భారత్, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, టికెట్ రేట్ల పెంపు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు 24 ఇతర యూనియన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశానికి రేవంత్ హాజరయ్యారు. ఈ సభలో రేవంత్ ప్రసంగించారు. "టికెట్ రేట్లు పెంచాలంటే, పెరిగిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇకపై జీవో ఇవ్వమని!" అని స్పష్టం చేశారు.
"సినిమా టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మాత్రమే డబ్బులు వస్తాయి. కానీ, పరిశ్రమలో శ్రమిస్తున్న కార్మికులకు – లైట్ మెన్, కెమెరా టెక్నీషియన్లు, స్పాట్ బాయ్స్ వంటి వారికి ఏమీ రాదు. అందుకే, ఇకపై టికెట్ రేట్ల పెంపుకు అనుమతి (జీవో) ఇవ్వాలంటే, పెరిగిన రేట్‌లో 20 శాతం మొత్తం తప్పకుండా కార్మికుల సంక్షేమ నిధికి ఇవ్వాలి" అని ప్రకటించారు.
హాలీవుడ్‌ను ఇక్కడికి తీసుకువచ్చే బాధ్యత తనదేనన్నారు. చిన్న సినిమాలను తక్కువచేసి చూసే ప్రసక్తే లేదు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరుమీదు.. గద్దర్ ఫిల్మ్ అవార్డ్‌ను ప్రకటించి చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తున్నామని గుర్తుచేశారు. . సినీ కార్మికుల శ్రమ నాకు తెలుసు. అధికారంతో నాక ళ్లు మూసుకుపోలేదు.. కార్మికుల కష్టాలు నాకు తెలుసు. ఆస్కార్ స్థాయికి తెలుగు పరిశ్రమ వెళ్లింది అంటే కారణం కార్మికులేనని రేవంత్ అన్నారు.
ప్రభుత్వం తరపున 10 కోట్లు సినీ కార్మికుల వెల్ఫేర్ ఫండ్‌లో డిపాజిట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది మీ హక్కు. మీరు ఎప్పుడు అవసరమైనా ఈ డబ్బును ఉపయోగించుకోవచ్చునని ప్రకటించారు. కృష్ణనగర్ లో సినీ కార్మికుల పిల్లల కోసం ప్రత్యేక స్కూల్ నిర్మిస్తామన్నారు. ఇది ఆధునిక సౌకర్యాలతో, ఉచిత విద్యతో ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. హెల్త్ ఇన్షూరెన్స్, పెన్షన్, స్కిల్ డెవలప్‌మెంట్ ఈ సమస్యలన్నింటినీ కార్మికులు తన దృష్టికి తెచ్చారని.. ఆరోగ్య కార్డులు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్లు, పెన్షన్ స్కీమ్ ఇవన్నీ మీకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో ఎవరైనా వ్యక్తులు లేదా వ్యవస్థలు నియంత్రణ తీసుకోవాలనుకుంటే, ప్రభుత్వం ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్‌ను హాలీవుడ్ మార్చాలంటే, ముందు కార్మికుల సంక్షేమం బలోపేతం కావాలన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >