Posted on 2025-10-28 15:06:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం కొత్తగా పోలీస్ స్టేషన్స్ రైటర్స్ గా నియమితులైనటువంటి సిబ్బందికి వారం రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సమగ్రంగా రికార్డుల నిర్వహణలో నైపుణ్యం పెంపొందించడం, పారదర్శకత , సమయపాలన పోలీసు వ్యవస్థ బలోపేతానికి ముఖ్యమైన అంశాలు అని తెలియజేశారు. ఈ శిక్షణలో పోలీస్ స్టేషన్ రైటర్స్‌కు కేసు దర్యాప్తు పత్రాలు , ఎఫ్‌ఐఆర్ రిజిస్ట్రేషన్ , సైబర్ క్రైమ్ రికార్డింగ్ , రిపోర్టింగ్ , మరియు ఆధునిక పోలీస్ డాక్యుమెంటేషన్ పద్ధతులపై , మార్గదర్శకాలు అందించబడతాయన్నారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో పనిచేస్తున్న స్టేషన్ రైటర్స్ కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ శిక్షణ పూర్తి అయిన తరువాత సిబ్బంది పోలీస్ స్టేషన్కు వెళ్లిన తదుపరి తమ పై అధికారులకు ఈ శిక్షణ గురించి క్షుణ్ణంగా తెలియజేసి సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదరులతో ఏవిధంగా ఉండాలో, కేసులు నమోదు అవుతే ఏ విధంగా సత్వర చర్యలు తీసుకోవాలో అట్టి కేసులలో శాస్త సాంకేతిక పద్ధతులు ఏ విధంగా చేయాలో తెలియజేయాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ( అడ్మిన్ ) జి. బస్వా రెడ్డి , పోలీసు శిక్షణ కేంద్రం ఏసిపి రాజశేఖర్ , సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >