| Daily భారత్
Logo




జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించడం తథ్యం

News

Posted on 2025-10-28 14:57:24

Share: Share


జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించడం తథ్యం

ఆ రెండు పార్టీలు తోడుదొంగలే

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అభ్యర్థులను ఈ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించడం తద్యమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు తో కలిసి మంగళవారం ఎర్రగడ్డ డివిజన్‌లోని పలు కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ప్రాంతం నుండి బీజేపీకి 25,000 ఓట్ల మెజారిటీ రావడం ప్రజల నమ్మకానికి నిదర్శనం అని అన్నారు. అదే విశ్వాసంతో ఈ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా ప్రజలు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ని బ్రహ్మాండమైన మెజారిటీతో ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. గడచిన 23 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం “ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్” పాలనగా మారిందని ఆయన విమర్శించారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇందిరమ్మ ఇండ్లు, ఒక్కటీ అమలు కాలేదని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. హైదరాబాద్ నగరానికి కనీస మౌలిక వసతులకైనా నిధులు కేటాయించలేకపోవడం రేవంత్ రెడ్డి పాలన చేతకాని వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. చిన్న వర్షానికే రోడ్లు మునిగిపోతున్నాయని, ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఎటువంటి శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. 2014–2023 మధ్య బీఆర్ఎస్ కుటుంబరాజకీయం, అవినీతి, భూస్కాంలతో ప్రజలను విసిగించిందని, ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని తెలిపారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను ప్రజలు తిరస్కరించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రమే ప్రజల సమస్యలకు పరిష్కారం చూపగల పార్టీ అని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో హైదరాబాద్‌కు కేంద్ర నిధులు, పథకాల ద్వారా అనేక ప్రయోజనాలు అందాయని చెప్పారు.

జూబ్లీహిల్స్ అభివృద్ధికి ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడు కావాలని, అది తమ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తోనే సాధ్యమవుతుందన్నారు. ఆయన అనునిత్యం ప్రజల మధ్య ఉండే నాయకుడు అని పేర్కొన్నారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >