| Daily భారత్
Logo




మోడీ, బీజేపీ, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై దేశవ్యాప్త కుట్ర

News

Posted on 2025-10-29 10:09:24

Share: Share


మోడీ, బీజేపీ, ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యత పై దేశవ్యాప్త కుట్ర

ఇది చరిత్రలోనే అతి పెద్ద రాజకీయ కుట్ర!!

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఎస్సీ వర్గీకరణను శాంపుల్ గా పంజాబ్ హర్యానాలో మొట్టమొదటిగా ఈ దేశంలో చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, బీజం కాంగ్రెస్ పార్టీ వేస్తే దీన్ని దేశం మొత్తం చేశాడు మన మోడీ సాబ్, దేశంలో అందరికన్నా ముందుగా ఎస్సీ ప్రెస్ క్లబ్లో వర్గీకరణ తెలంగాణ రాష్ట్రం చేయడం, దాన్ని కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ ఫాలో అవ్వడం, దేనికి నిదర్శనం అని  నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్..

డాక్టర్ ఆర్ ఎస్ రత్నాకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాహుల్ గాంధీకి ఇదంతా తెలిసే జరుగుతా ఉందా అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ అనేది సామాజిక న్యాయం అని డప్పు కొట్టుకునే రేవంత్ రెడ్డి, ఈ సామాజిక న్యాయం ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసే కేవలం ఎంగిలి మెతుకుల్లోనేనా? ఈ దేశ సంపద, ముఖ్యమంత్రి పదవి,,మంత్రి పదవులు ఈ దేశ పరిశ్రమలు జడ్జెస్ నియామకాలు, పరిశ్రమల్లో అక్కర్లేదా? ఆ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజానికి ఎస్సీ వర్గీకరణ వల్ల వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతోందన్నారు. ఈ వందలో నలుగురికి ఇచ్చే ఈ  ఈ ఫలాలను దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్న 1108 ఎస్సీ కులాలకు ఎలా పంచుతారు మోడీ అని అడిగారు? అలాగే ఈ నాలుగు సీట్లను తెలుగు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలకు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ప్రశ్నించారు? ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు మాల సామాజిక వర్గం పై ప్రగతించుకుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలపై తనకు ఏ విధమైన ఈర్ష ద్వేషాలు ఉన్నాయో చేసి చూపించారని, ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయినవి కదా, ఇక చేసేదేముందని అనుకోకండి.. ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందే, తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు  మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం, ఘోరం అన్యాయం, చెంచా గిరికి అలవాటు పడ్డ మాల నాయకులు రాజకీయ పార్టీలకు విశ్వాసంగా ఉన్నారే తప్ప జాతి పట్ల విశ్వాసంగా లేరన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి, రిజర్వేషన్లు బెనిఫిట్ పొందిన మాల ఉద్యోగుల రా  మాల జాతిని తొక్కేస్తా ఉన్నారు ఇకనైనా కళ్ళు తెరిచి  బయటకు రండి  మా ఈ పోరాటానికి మద్దతు ఇవ్వండి. తెలుగు రాష్ట్రాల్లో ఏ నాడు ఎదుర్కొనటువంటి గడ్డు పరిస్థితిని మాల సామాజిక వర్గం ఈరోజు ఎదుర్కొంటూ ఉంది,  పూర్తిగా తెలుగు రాష్ట్రంలో మన కులం యొక్క ఉనికిని కోల్పోయామని అన్నారు. శాంతియుత పోరాటానికి సిద్ధం గా ఉన్నామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో, గైని గంగారామ్  సక్కి ప్రభంజన్, సక్కి సంజీవ్, బల్లెం లక్ష్మణ్,  మిరియాల బాలశౌరి   కొప్పుల ప్రేమ్ బాబు  నెల్లి సూరిబాబు, కనికెళ్ల నాని     తదితరులు పాల్గొన్నారు.

Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >