Posted on 2025-10-29 11:02:35
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినముల సందర్భంగా (పోలీస్ ఫ్లాగ్ డే) బుధవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రక్తదాన శిఖిరం కార్యాక్రమం ఉదయం 9 గంటలకు నిర్వహించగా ముఖ్య అతిధులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది చేసే రక్తదానం అత్యవసర సమయాల్లో ఇతరులకు ప్రాణదానం అవుతుందని, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ప్రతీ ఒక్కరూ ఇటువంటి సామాజిక సేవవలలో పాల్గొని తోటి వారి ప్రాణాలను కాపాడటములో తమ వంతు సహయముగా రక్తదానం చేయడం అనేది ఒక సామాజిక కార్యక్రమం అని ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. మీరు ఒకరి ప్రాణం కాపాడినవారు అవుతారని తెలియజేశారు. ఈ రక్తదానం చేయడం ద్వారా మనం ఎందరికో కొత్తజీవం అందించిన వారు అవుతారు అని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో దాదాపు 177 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రక్త దానo చేసిన వారికి పోలీస్ కమిషనర్ హెల్మెట్ లు ప్రదానం చేశారు. ఈ రక్తదాన శిబిరంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్) రామ్ చందర్, నిజామాబాద్ ఎ.సి.పి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఎ.సి.పి. మస్తాన్ అలి, పోలీస్ యునిట్ ఆఫీసర్ డా॥ సరళ, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీ సతీష్, శ్రీనివాస్, జిల్లా ప్రభుత్వ హాస్పటల్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఇమ్రాన్ అలీ, సి.ఐలు, ఎస్.ఐలు, మోక్ష డ్రెస్సెస్ యాజమాన్యం ప్రవీణ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, ప్రభుత్వ హాస్పటల్ సిబ్బంది, పోలీస్ యునిట్ హాస్పటల్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు రక్తదానం చేసిన ప్రజలు హాజరయ్యారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >