Posted on 2025-10-29 12:43:27
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఒక మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి, హిందువుగా మారతానని నమ్మించి అత్యాచారం చేసిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష,మోసం చేసినందున మరో సంవత్సరం సాదారణ జైలుశిక్ష విదిస్తూ మహిళలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం నిజామాబాద్ స్పెషల్ జడ్జి హరీష బుధవారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన నలభై మూడు పేజీల తీర్పులోని వివరాలు. నిజామాబాద్ నగర పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కోర్టుకు సమర్పించిన అభియోగ పత్రం అదారంగా నేర న్యాయ విచారణలో భాగంగా మొత్తం పదమూడు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, అన్నింటిని అధ్యయనం చేసిన పిదప నేరారోపితుడు అయిన మహమ్మద్ అబ్దుల్ లతీఫ్ పై మహిళను మోసం చేసి, పదే పదే ఆమెపై అత్యాచారం చేసిన నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారించింది. ఒక హిందూ మహిళను ప్రేమిస్తున్నానని నమ్మించి హిందువుగా మారి పెళ్లి చేసుకుంటానని ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారం చేశాడు. మాయమాటలు చెప్పి మోసం చేశాడు. భారత శిక్షాస్కృతి ప్రకారం సెక్షన్ 417(మోసం చేయడం ) ప్రకారం ఒక సంవత్సరం సాదారణ జైలుశిక్షతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష, సెక్షన్ 376(2)(ఎన్) అత్యాచారం చేసిన నేరానికిగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా, జరిమానా చెల్లించని యెడల అదనంగా ఆరు నెలల సాదారణ జైలుశిక్ష అనుభవించాలని అదనపు సెషన్స్ హరీష తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >