Posted on 2025-10-29 15:10:44
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి ప్రచారం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ రహమత్ నగర్ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నిజామాబాద్ అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైందని విమర్శించారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చగల పార్టీగా, పారదర్శక పాలనతో ప్రజల విశ్వాసం గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయమని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి తీసుకురావగల నాయకుడు లంకల దీపక్ మాత్రమే అని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై సేవ చేసేవారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు అండగా నిలిచి గెలిపించి కాంగ్రెస్ ముసుగులో ఉన్న మజ్లిస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి తరపున ఇంటింటికి వెళ్లి, ప్రజల మద్దతు కోరారు. ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు ప్రజల ఉత్సాహభరితమైన స్పందనను చూసి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి లక్ష్మణ్, సౌభాగ్య లక్ష్మీ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు,మల్లేష్ గుప్తా సీనియర్ నాయకులు,బట్టికిరి ఆనంద్,మరవర్ కృష్ణ,బాలనగేష్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >