Posted on 2025-10-30 14:32:18
నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందించిన బిజెపి నాయకులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. జిల్లాలో లక్షల ఎకరాల్లో కోసిన వరి పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారు. అయితే, కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, ప్రారంభమైన కేంద్రాల్లో కూడా వడ్ల కుప్పలు లేపకపోవడం వలన, ఇటీవలి భారీ వర్షాల కారణంగా రోడ్లపై, కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసి నష్టపోయింది. ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ కంటెంట్ కారణంగా తిరస్కరించకుండా బాయిల్ రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రంగు మారిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరారు.
భవిష్యత్తులో అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం టార్పాలిన్లను ఉచితంగా లేదా సబ్సిడీతో అందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై గురువారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బిజెపి బృందం నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, పద్మరెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >