Posted on 2025-10-30 14:37:44
డైలీ భారత్, జూలూరుపాడు:కొమ్ముగూడెం గ్రామానికి చెందిన భానోతు కబీర్ దాస్ ,45 సంవత్సరాలు మాచినపేట రెవెన్యూ పరిధిలో 0.35 గుంటల వ్యవసాయ భూమి ఉన్నదని, అట్టి భూమిని కబీర్ దాస్ అన్న కొడుకు అయిన బానోతు లింగ ఆక్రమించుకొని, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసినాడని, అట్టి భూమి లింగాదే అంటూ బానోతు హేమ్ల తప్పుడు కాగితాలు రాసినాడని, అదే భూమిని కబీర్దాస్ పేరుమీద పట్టా చేయిస్తానని గుగులోతు కృష్ణ అనే అతను మూడు లక్షల రూపాయలు కబీర్ దాస్ వద్ద తీసుకున్నాడని, మరోపక్క గ్రామ పెద్దమనిషి అయిన భానోతు కిషన్ కలుగజేసుకుని అట్టి భూమి కబీర్దాస్ పేరుమీద పట్టా చేయించవద్దంటూ లింగాపై ఒత్తిడి చేశాడని, అయితే మృతుడు కబీర్ దాస్ తన భూమి చుట్టూ లింగా వేసిన ఫెన్సింగ్ తీయించాలని, లింగ మరియు సునీతలను వేడుకున్నను, మృతుడి మాటలు లెక్కచేయకుండా ఏం చేసుకుంటావో, చేసుకో అని బూతులు తిట్టినారని, బానోతు లింగ మరియు లింగా భార్య సునీతలు బానోతు హేమ్ల, గుగులోతు కృష్ణ, బానోతు కిషన్ కబీర్ దాస్ ను ఇబ్బందులకు గురి చేయగా, వారు పెట్టిన ఇబ్బందులు తాళలేక మరియు తన భూమి తనకు దక్కకుండా పోతుందేమోనన్న భయముతో కబీర్ దాస్ తేదీ ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా, కుటుంబ సభ్యులు గమనించి, చికిత్స కొరకు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి, తరలించగా చికిత్స కోసం ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి,నుండి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించినను కబీర్ దాస్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడక, కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రి చికిత్స పొందుతూ ,ఉదయం 5 గంటల సమయంలోమృతిచెందినాడని,మృతుడి కుమారుడు భానోత్ నందు, ఎస్ఐఫిర్యాదు ఇవ్వగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రవి , బానోతు లింగ, సునీత, బానోతు హేమల, గుగులోతు కృష్ణ, బానోత్ కిషన్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసినారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >