Posted on 2025-10-31 13:57:41
రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
పాల్వంచ మండలంలో పర్యటించి దెబ్బతిన్న పంటను పరిశీలించిన కొత్వాల
డైలీ భారత్, పాల్వంచ: ఇటీవల మొంథా తుఫాన్ వలన రైతులకు కలిగిన పంట నష్టాన్ని అధికారులు అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ పాల్వంచ సొసైటీ అధ్యక్షులు, కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పాల్వంచ మండలంలోని పలు గ్రామాల్లో కొత్వాల పర్యటించారు. సంగెం, నారాయణరావు పేట, గ్రామాల్లో నీట మునిగిన వరి పంటకు జరిగిన నష్టాన్ని పరిశీలించారు.వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ...
మొంథా తుఫాన్ రాష్ట్రంలోని రైతులను నట్టేట ముంచిందన్నారు.అకాల వర్షంతో చేతికి అందిన వరి,పత్తి,మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు. తెలంగాణ రైతాంగం పండించిన పంట అకాల వర్షం కారణంగా తడిసి ముద్దయిందన్నారు. చేతికొచ్చిన వరి,పత్తి,మిర్చి పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయని కొత్వాల అన్నారు.వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేసి పంట నష్టాన్ని అంచనాలు వేయాలని అన్నారు.తద్వారా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వాలన్నారు.పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు,పెద్దమ్మ గుడి డైరెక్టర్ భూక్య గిరి ప్రసాద్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్,కాంగ్రెస్ నాయకులు ఉండేటి శాంతి వర్ధన్, గంగుల వెంకటేశ్వర్ రెడ్డి,బెల్లం మల్లేష్,రైతులు నేలపట్ల శ్రీనివాస్ రెడ్డి,మట్ట చిన్న సీతారాం రెడ్డి, జర్పుల లక్ష్మయ్య ,గుర్రం హుస్సేన్, ఇంగాలపు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >