Posted on 2025-10-31 15:39:29
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మానసిక దివ్యాంగ విద్యార్థులు దేశ ఐక్యత తెలిపే దిశగా ర్యాలీ చేపట్టి నినాదాలతో హోరెత్తించారు స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో మానసిక, దివ్యాంగ మరియు అంద, విద్యార్థినీ విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.. ఈ ర్యాలీ స్నేహ సొసైటీ పాఠశాల నుండి పురవీధుల గుండా కొనసాగించి దేశ ఐక్యతను చాటి చెప్పే విధంగా ఐక్యమత్యమే మహాబలం, హమ్ సబ్ ఏక్ హై , యునైటెడ్ వి స్టాండ్, మేరా భారత్ మహాన్ అనే నినాదాలతో దేశ ఐక్యతను పురవీధుల గుండా సాగుతూ చాటిచెప్పారు... ఈ ర్యాలీ అనంతరం స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటుచేసిన దేశ ఐక్యత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భాగంగా స్నేహ సొసైటీ,కార్యదర్శి ఎస్ సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సి పాల్ రాజేశ్వరి మాట్లాడుతూ శాంతి అహింస అనే నినాదంతో జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాడడం జరిగిందన్నారు.. అయితే స్వాతంత్ర్య అనంతరం వివిధ సంస్థానాదిశుల పాలనలో ఉన్న రాష్ట్రాలను , ఈశాన్య భారతంలో భాగమైన కొన్ని రాష్ట్రాలను,నైజాం పాలనలో ఉన్న హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రాలను భారత యూనియన్ లో కలిపారు.దేశ సమగ్రత దేశ ఐక్యత కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వారు తెలిపారు.. అలాగే ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవసాయ రైతాంగం దీనస్థితిలో ఉన్న వారికి సైతం వెన్నుదన్నుగా ఉండి పోరాడడం వల్ల అన్నదాతలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పిలవడం జరిగిందని తెలిపారు.. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను 2014 నుండి నిర్వహిస్తున్నప్పటికీ ఈ సంవత్సరం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారం ప్రతి ఒక్కరికి దేశ సమైక్యత సౌభాతృత్వం మానసిక దివ్యాంగులే కాకుండా ప్రతి ఒక్కరికి తెలియపరిచే దిశగా వచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు... ప్రతి ఒక్కరూ కులమాతాలకతీతంగా కలిసి ఉన్నప్పుడే దేశ ఐక్యత ఇతర దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వారు సూచించారు...
ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్దయ్య , అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి,ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు...
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >