Posted on 2025-11-01 05:52:31
డైలీ భారత్, జూలూరుపాడు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారుపాడు గ్రామానికి చెందిన మేజర్ యువతిని జూలూరుపాడు గ్రామానికి చెందిన ఓ మేజర్ యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. సదరు నవ దంపతులు తాము మేజర్లు అయినందున తమకు రక్షణ కల్పించవలసిందిగా జూలూరుపాడు పోలీసు వారిని ఆశ్రయించినారు. అయితే సదరు నవ దంపతులు పోలీస్ స్టేషన్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు సుమారు అన్నా పాడు గ్రామానికి చెందిన 100 ఆడ మగ పోలీస్ స్టేషన్ కు చేరుకొని తమ కుమార్తెను తమకు అప్పగించాలని, పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని గొడవకు దిగార జూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఇరువర్గాల వారిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి,సదరు యువతి అభిప్రాయం తల్లిదండ్రులు 100మంది సమక్షంలో తెలుసుకొనగా, తాను మేజర్ అని, ప్రేమించిన వ్యక్తితోనే జీవిస్తానని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఈ మాటలు విన్న యువతి తరపు బంధువులు, ఆవేశంతో ఊగిపోయి, నానా హంగామా చేస్తూ పోలీస్ స్టేషన్లో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినారు. ఇట్టి ఘటనలో 14 మంది వ్యక్తులపై కేసు నమోదు అయింది. వీడియో ఆడియో ఆధారంగా మరికొంత మందిని కూడా గుర్తించి వారిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈసందర్భంగాజూలూరుపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ బాదావత్ రవి ఈ సందర్భంగా తెలియజేసినారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >