| Daily భారత్
Logo




ఇందూరు నుండి శబరిమలై అయ్యప్ప ఆలయం వరకు చేపట్టనున్న మహా పాదయాత్రను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

News

Posted on 2025-11-01 15:23:50

Share: Share


ఇందూరు నుండి శబరిమలై అయ్యప్ప ఆలయం వరకు చేపట్టనున్న మహా పాదయాత్రను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇందూరు నగరం నుండి కేరళలోని పవిత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం వరకు మహా పాదయాత్రకు  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “భక్తి, నియమ నిష్టలు మన భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక పునాది లాంటివని అన్నారు. నిజామాబాద్ నుండి కేరళ వరకు జరుగుతున్న మహా పాదయాత్ర అనేది కేవలం భౌతిక ప్రయాణం మాత్రమే కాదు — అది ఆంతరిక సాధన, ఆత్మీయ మార్గం. ఇలాంటి పాదయాత్రలు యువతలో ధార్మిక చైతన్యాన్ని, నియమశీలతను పెంపొందించడంతో పాటు, సమాజంలో ఐక్యతను బలపరుస్తాయన్నారు. అయ్యప్ప స్వామి భక్తుల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసే శక్తి, ప్రసాదించాలని ఆ  మణికంఠుడిని ప్రార్థిస్తున్నాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలిపారు. ఈ మహా పాదయాత్రలో పురంశెట్టి నంద కిషోర్, నూరు రాజేందర్, వేణు, సాయిరెడ్డి, సుధాకర్, దీపక్, గంగా ప్రసాద్ తదితర భక్తులు పాల్గొంటున్నారన్నారు. వీరందరూ శబరిమల స్వామి దర్శనం కోసం నిజామాబాద్ నుంచి సుమారు 1500 కి.మీ. దూరాన్ని పాదయాత్రగా పూర్తి చేయనున్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్థానిక భక్తులు, ప్రజా ప్రతినిధులు, అయ్యప్ప సేవా సంఘ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని అయ్యప్ప స్వామి నామస్మరణతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >