| Daily భారత్
Logo




షాద్ నగర్ లో ఉద్రిక్తత... విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం

News

Posted on 2025-11-02 12:44:59

Share: Share


షాద్ నగర్ లో ఉద్రిక్తత... విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం

నడి చౌరస్తాపై విద్యార్థినులకు పోలీసులకు మధ్య వాగ్వివాదం

విద్యార్థినిపై చేయి చేసుకున్న మహిళా కానిస్టేబుల్

మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టి ఈడ్చుకుని కొట్టిన విద్యార్థినిలు

విద్యార్థినీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలింపు

డైలీ భారత్, రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కమ్మదనం వద్ద ఓ భవనంలో కొనసాగుతున్న ఈ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ప్రిన్సిపల్ అక్రమాలు వేధింపులపై గళం ఎత్తి మెరుపు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆదివారం కావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున కళాశాల భవనం నుండి రోడ్లపైకి వచ్చారు. అయితే ఈ క్రమంలో పట్టణ చౌరస్తాకు చేరుకున్న విద్యార్థినిలు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు ఆందోళన విరమింప చేయడానికి బలవంతంగా విద్యార్థినీలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థినిలతో ఓ మహిళా కానిస్టేబుల్ వాగ్వివాదానికి దిగారు. ఇంతలో ఓ విద్యార్థినిపై చేయి చేసుకోవడం చూసి మిగతా విద్యార్థులు ఆగ్రహానికి గురై తమనె కొడతారా అంటూ మహిళా కానిస్టేబుల్ జుట్టు పట్టుకొని ఈడ్చుకుని చితకబాదారు. ఈ ఘటనకు అందరూ నిశ్చేస్తులై పోయారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వస్తే మమ్మల్ని కొడతారా అంటూ విద్యార్థులు నిలదీశారు. ఒకరిపై చేయి చేసుకున్న ఎవరిని విడిచిపెట్టబోమని విద్యార్థినిలు తీవ్రంగా పోలీసులను హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు విద్యార్థినిలను బలవంతంగా కొంతమందిని పోలీసు వాహనంలోకించుకొని వెళ్లిపోయారు. మహిళా సిబ్బంది సరిగ్గా సంఖ్య లేకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి..

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >