Posted on 2025-11-02 13:32:58
మంజూరైన నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి
అన్ని వార్డులో సైడ్ డ్రైనేజ్ నిర్మించాలి.
సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం
డైలీ భారత్, ఖమ్మం జిల్లా: సిపిఐ(ఎం) పోరాట ఫలితంగా వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన 15 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రభుత్వం, అధికారులు వెంటనే ప్రారంభించాలని, మంజూరైన నిధులను సక్రమంగా వినియోగించాలని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ(ఎం) సుందరయ్య నగర్ శాఖ - 2 సమావేశం మాడపాటి మల్లికార్జునరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో భూక్యా వీరభద్రం మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సైడ్ డ్రైనేజ్ వ్యవస్థను పూర్తిగా నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షం పడ్డప్పుడల్లా మురుగు నీళ్లు నిలువ ఉండటం వలన అధిక దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. నిలిచిపోయిన మురుగు నీటిని మున్సిపాలిటీ అధికారులు తక్షణమే తొలగించాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో శాఖా కార్యదర్శి, పట్టణ నాయకులు గుడిమెట్ల మోహన్ రావు, మాడపాటి వెంకటేశ్వరరావు, సామినేని నరసింహారావు, భూక్యా విజయ, మాడపాటి సుజాత, మోదుగు నాగరాణి తదితరులు పాల్గొన్నారు.
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >