| Daily భారత్
Logo




పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చు.. అదే నిజమని నమ్మి మనస్థాపం తో గృహిణి ఆత్మహత్య

News

Posted on 2024-01-09 11:37:02

Share: Share


పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చు.. అదే నిజమని నమ్మి మనస్థాపం తో  గృహిణి ఆత్మహత్య

యూట్యూబ్‌లో చెప్పినట్టుగా తాము విడిపోతామని నమ్మిన గృహిణి

అలాంటివి నమ్మొద్దంటూ నచ్చజెప్పిన భర్త

వాగ్వివాదం జరగడంతో అందరి ముందు భార్యపై చేయిచేసుకున్న భర్త

మనస్తాపంతో ఉరివేసుకున్న భార్య

డైలీ భారత్, హైదరాబాద్: పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చుపెట్టింది. గృహిణి ఆత్మహత్యకు కారణమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబిత (28), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాము (30)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానాజీగూడ ఇందిరానగర్‌లో కాపురం పెట్టిన దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత ఓ యూట్యూబ్‌లో చెప్పిన జ్యోతిష్యం విన్నది. అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని భర్తతో తరచూ చెప్తే ఆయన కొట్టిపడేసేవాడు.

ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన కుమారుడి బర్త్ డేకి బంధుమిత్రులందరూ హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు మాత్రం రాలేదు. సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా, కుమారుడు అంగన్‌వాడీకి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చి చిన్నారి తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించంతో కంగారుపడిపోయాడు. వెంటనే కింది పోర్షన్‌లో ఉండే బాబాయికి చెప్పడంతో ఆయన వచ్చి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు.

అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రాముపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కుమార్త ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే, జ్యోతిష్యాన్ని నమ్మే ఆమె ఆత్మహత్య చేసుకుందని, దానిని నమ్మవద్దని తాను పదేపదే చెప్పేవాడినని రాము చెప్పాడు. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహం పట్టలేని రాము భార్యపై అందరిముందు చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >