| Daily భారత్
Logo




పోలీస్ శాఖలో మంచి ప్రవర్తన కలిగిన ప్రమోద్ పై నిజానిర్ధారణ కమిటీ చేస్తున్న ఆరోపణలు అసత్యం

News

Posted on 2025-11-02 15:05:50

Share: Share


పోలీస్ శాఖలో మంచి ప్రవర్తన కలిగిన ప్రమోద్ పై నిజానిర్ధారణ కమిటీ చేస్తున్న ఆరోపణలు అసత్యం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పోలీస్ శాఖలో మంచి ప్రవర్తన కలిగిన దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు చేసిన నిజ నిర్ధారణ కమిటీ (ఫ్యాక్ట్ ఫైండ్ కమీటి) తీరును మాల మహానాడు, ప్రజా సంఘాలుi ఖండించాయి. అదివారం జిల్లా కేంద్రంలో మాలమహానాడు నాయకులు అలుక కిషన్, ప్రజా సంఘాల నాయకులు రమేష్ బాబు, దండి వెంకటి, మాల మహానాడు నాయకులు బంగారు సాయిలు, చొక్కం దేవిదాస్, అనంపల్లి ఎల్లయ్య, రాంచంధర్ గైక్వాడ్ లు మాట్లాడుతూ... సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన రియాజ్ పై 61 కేసులు, రెండు హత్యాయత్నాల కేసులు ఉంటే ఏవిధంగా రికవరీ ఏజెంట్ అయ్యాడని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పరారీలో ఉన్న రియాజ్ ను పట్టుకునేందుకు వెళ్లినప్పుడు కానిస్టేబుల్ ప్రమోద్ ని రియాజ్ హత్య చేసాడని ప్రపంచానికి తెలుసు అని అన్నారు. దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు చేయడం తగదు అన్నారు. నిజనిర్ధారణ కమిటీ ఎక్కడో కూర్చుని విచారణ చేయటం కరెక్ట్ కాదు అని తెలిపారు. రియాజ్ దాడిలో చనిపోయిన ప్రమోద్ కుటుంబాన్ని పరామార్శించకపోగ మృతుడు ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు రావటం, రియాజ్ కుటుంబం ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. పోలీసులు రియాజ్ కుటుంబాన్ని వేధించారనటం తప్పుడు ఆరోపణలు అని దివంగత కానిస్టేబుల్ ప్రమోద్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు. రియాజ్ ఓ రౌడీ షీటర్.. మొత్తం ఘటన మీద నిజ నిర్ధారణ కమిటీ తప్పుడు సంకేతాలు ఇవ్వటం ఎవరి కోసమో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ఫ్యాక్ట్ ఫైండ్ కమిటికి చట్టబద్ధత ఉందా అని ప్రశ్నించారు. ప్రమోద్ మీద తప్పుడు ఆరోపణలు, అబాండాలు వేయటం మంచి పద్ధతి కాదని, నిజ నిర్ధారణ కమిటీ వ్యవహార శైలి సరిగా లేదన్నారు. దివంగత ప్రమోద్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ఫ్యాక్ట్ ఫైండ్ కమిటిపై చత్తరీత్యా చర్యలుత్త రీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.

Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >