Posted on 2025-11-04 14:28:00
ఇంటికి ప్రచారంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్ / నిజామాబాద్:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హేమావతి నగర్, శారది సొసైటీ, జనప్రియ కాలనీ, ప్రభాత్ నగర్ ప్రాంతాల్లో ఆయన ప్రజలతో భేటీ అవుతూ, ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గల్లీ, ప్రతి వాడలో కాంగ్రెస్ వాతావరణం నెలకొంది. ప్రజలంతా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు జూబ్లీహిల్స్ లో భారీ మెజార్టీతో గెలవడం ఖాయం,” అన్నారు. గత ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్ని అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మూడు నెలల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో తీసుకువచ్చిందని అన్నారు. స్థానికంగా ఉండే వారికి ఓటేసి , కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు. భూపతిరెడ్డి తో పాటు ఈ ప్రచారంలో డిచ్ పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోలసాని శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, మోపాల్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, ధర్పల్లి మండల అధ్యక్షులు బాలరాజ్ ,మాజీ ఎంపీపీ గోపి, యూత్ నాయకులు ఉమ్మాజి నరేష్, మాజీ ఐ సి డి ఎం ఎస్ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ జెడ్పిటిసి మోహన్, మాజీ సర్పంచులు భాగరెడ్డి, జనార్ధన్, చిన్న సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ శంకర్, యువ నాయకుడు రాజేష్, శ్రీనివాస్,మల్లేష్ ప్రశాంత్, వినోద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ప్రచారం అంతటా కాంగ్రెస్ నినాదాలు మారుమ్రోగగా, స్థానికులు హర్షాతిరేకంగా పార్టీకి మద్దతు తెలుపుతున్నారన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >