Posted on 2025-11-05 12:50:48
డైలీ భారత్, పాలడుగు:సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద ప్రజానాట్యమండలి కళాకారుడు మోదుగు గోవిందరావును పరామర్శించారు. వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన మోదుగు గోవిందరావుకు ఇటీవల కాలంలో ఖమ్మం నుండి వస్తున్న సమయంలో వైరా అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగి చేతులు, కాళ్లకు తీవ్రమైన దెబ్బలు తగిలాయి. ఆపరేషన్ అనంతరం ఇంటివద్ద వైద్య చికిత్స పొందుతున్నారు. బుధవారం సిపిఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాలడుగు గ్రామంలోని మోదుగు గోవిందరావు ఇంటికి వచ్చి పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యులు తూము సుధాకర్, వైరా మండల కమిటీ సభ్యులు బాజోజి రమణ, పాలడుగు గ్రామ శాఖ కార్యదర్శి షేక్ మజీద్ బి, షేక్ రేహాన, షేక్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >