Posted on 2025-11-06 09:39:05
మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: తాను ఐఏఎస్‌ను అంటూ ఓ మహిళ కామారెడ్డి కలెక్టర్ లోసృష్టించింది హల్చల్ సృష్టించింది. ఇంచార్జి కలెక్టర్ హోదాలో వచ్చానంటూ నకిలీ ఉత్తర్వులతో మహిళ హంగామా చేసిన ఘటన కామారెడ్డి కలెక్టరేట్లో కలకలం రేపింది. తనకు ఉద్యోగం వచ్చినట్టు కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ విఫల ప్రయత్నం చేసిందని పోలీసులు నిర్ధారించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ నెల 2వ తేది నుండి సెలవులో ఉండగా, ఇంచార్జి కలెక్టర్‌గా నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించారు. అయితే ఇంతలోనే ఈ నెల 4వ తేదీన కామారెడ్డి కలెక్టరేట్‌కు కారులో వచ్చిన నకిలీ కలెక్టర్ ఇస్రాత్ జహాన్ కలెక్టర్ ఛాంబర్ వైపు వెళ్లి, తనను ఇంచార్జి కలెక్టర్‌గా నియమించారని ఉత్తర్వులు నకిలీ ఉత్తర్వులు చూపించింది. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే మహిళ
ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపించామని, పైనుండి ఆదేశాలు వచ్చాక తమ నిర్ణయం చెబుతామని మహిళకు అదనపు కలెక్టర్ వివరించారు. కాసేపు ఛాంబర్‌లో కూర్చొని వెళ్లిపోవడంతో, అనుమానంతో కామారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు
సీసీ కెమెరాల ఆధారంగా తూప్రాన్ వద్ద మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను విచారించగా, 2020 నుండి గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుందని, ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఈ ప్రయత్నం చేసిందని పోలీసుల నిర్ధారించారు. దీంతో మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసిన ఆమెను పోలీసులు వదిలివేశారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >