Posted on 2025-11-06 13:41:45
చెలరేగిన బౌలర్లు.. టీమిండియా ఘన విజయం
డైలీ భారత్, క్రికెట్ న్యూస్: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటర్లు విఫలమైన వేళ బౌలర్లు చెలరేగి అద్భుత విజయాన్ని అందించారు.
శుభ్‌మన్ గిల్(39 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 46) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అభిషేక్ శర్మ(21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), శివమ్ దూబే(18 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 23), సూర్యకుమార్ యాదవ్(10 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా మూడేసి వికెట్లు తీయగా.. గ్జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం ఆస్ట్రేలియా 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్(24 బంతుల్లో 4 ఫోర్లతో 30), మాథ్యూ షార్ట్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, శివమ్ దూబే రెండేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్(3/3) మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >