| Daily భారత్
Logo




పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని అన్ని రంగాల ప్రజలకు మోసం

News

Posted on 2025-11-08 08:51:18

Share: Share


పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని అన్ని రంగాల ప్రజలకు మోసం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ గెలుపే దిశగా ప్రయత్నిస్తాం

డైలీ భారత్, నిజామాబాద్: పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్  విమర్శించారు. ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీతోనే యువతకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని, అందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే దిశగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు  శనివారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్లు,నియమకాలు, నిధులు అంటూ అధికారంలోకి వచ్చిన  బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు  తెలంగాణ ప్రజలను అన్ని రంగాల్లో మోసం చేసిందని రవికుమార్ విమర్శించారు.. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ  హామీలను విస్మరించిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు, తెలంగాణ  జిల్లాలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ లో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులుగా మంచి నాయకత్వం గల నాయకులను తయారు చేయడం జరుగుతుందన్నారు. అత్యధికంగా యువత కలిగిన తెలంగాణ  రాష్ట్రo లో చాలామంది యువకులు వారి విద్యకు తగిన ఉద్యోగం లేకుండా సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు కలగాలంటే రాజకీయరంగ ప్రవేశం చేయాలని,తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పక్క లోకల్ పార్టీ అని అన్నారు. లోకల్ యువతను చైతన్యవంతం చేయడమే తమ లక్ష్యం అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా చేయవచ్చని, ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. మార్పు అనేది పల్లె నుంచి పట్టణం వరకు చేరాలి గల్లీ నుండి ఢిల్లీ వరకు చేరాలన్నారు. ఈ  విలేకరు ల సమావేశంలో రాష్ట్ర నాయకులు రిటైర్డ్ ఐఐఎస్ ఆఫీసర్ కూనప రెడ్డి హరిప్రసాద్,   రాష్ట్ర మహిళా నాయకులు విజయ రెడ్డి, ఉదయసింగ్  తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >