Posted on 2025-11-11 14:12:38
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దాస్టికం
వైద్యం కోసం వెళ్లి మృతి చెందిన వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు అపహరించిన ఆస్పత్రి సిబ్బంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన వృద్ధురాలు మృతిచెందగా.. ఆమెపై ఉన్న బంగారు గొలుసు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నగరంలోని హైదరాబాద్ రోడ్లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హైదరాబాద్ రోడ్డులోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ వృద్ధురాలు గుండె సంబంధిత వ్యాధితో చేరింది. అయితే ఆదివారం తెల్లవారుజామున ఆస్పత్రిలో చేరగా.. మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో మృతి చెందింది. అయితే ఆమె మెడలో ఉన్న 18 గ్రాముల బంగారం గొలుసు చోరీకి గురైనట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందే గొలుసు చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ ఒక్క ఘటనతోనే కాదు జిల్లా కేంద్రంలోని ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది, ఆయాల నుంచి వాచ్మెన్ వరకు రోగి ఆసుపత్రిలో చేరిన నుండి వారు డిశ్చార్జ్ అయ్యేవరకు వారి బంధువుల నుండి ఏదో ఒక రూపంలో బలవంతంగా డబ్బులు వసూలు చేయడమే కాకుండా తాజాగా ఓ వైద్యం కోసం వచ్చి మృతి చెందిన వృద్ధురాలి మెడలో ఉన్న బంగారాన్ని కాజేసిన ఘటన కలకలం రేపింది. కాగా.. ఘటనకు గల సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఆ ప్రైవేట్ ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదంటూ ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్పడం విడ్డూరంగా అనిపిస్తుంది.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >