Posted on 2025-11-12 04:18:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశానుసారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఖాళీగా ఉన్న మండల అధ్యక్ష పదవులకు జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు కొత్త అధ్యక్షులు నియమించారు అందులో భాగంగా జూలూరుపాడు మండలంలో పార్టీ కోసం పనిచేసిన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన చాపల మడుగు రామ్మూర్తిని నియమించారు.,కానీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఆ కమిటీని రద్దు చేశారు. తాజాగా ఖాళీగా ఉన్న మండలాల్లో అధ్యక్షులుగా నియమించుకోండి అని రాష్ట్ర నాయకత్వం ఆదేశించడంతో ఈ పదవి మరలా చాపల మడుగు రామ్మూర్తికే వరించింది. ఈ సందర్భంగా చాపలమడుగు రామ్మూర్తి మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారము నడుచుకుంటానని అన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలకు 6 గ్యారంటీలు హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, మండల కేంద్రంలో ఉన్న సమస్యల గురించి అధికారులను నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మండల అధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >