| Daily భారత్
Logo




ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

News

Posted on 2025-11-12 04:17:02

Share: Share


ప్రభుత్వ నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వ్యక్తుల సమాచారం అందించండి : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

జిల్లా పోలీసులు చేపట్టిన "చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం" కార్యక్రమాలలో భాగంగా కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో సుజాతనగర్ మండలంభారీ బైక్ ర్యాలీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లో ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్  పిలుపు మేరకు నవంబర్ 15వ తేదీ వరకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సుజాతనగర్ పోలీసుల ఆధ్వర్యంలో సుజాతనగర్ సెంటర్ నుండి లక్ష్మిదేవిపల్లి,ఇల్లందు క్రాస్ రోడ్డు వరకు భారీ బైకు ర్యాలీని నిర్వహించడంజరిగింది. ముందుగా ఈ ర్యాలీని ఉద్దేశించి ఎస్పీమాట్లాడుతూ చైతన్యం అనే కార్యక్రమం ద్వారా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్ధాల బారిన యువత పడకుండా,వారికి అవగాహనకల్పించడం, గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం నిరంతర తనిఖీలు చేపట్టడం వంటి కార్యక్రమాలను జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించడం  జరుగుతుందని ఎస్పీ తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులు చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజలు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.గంజాయి అక్రమ రవాణా చేసే వారి సమాచారం అందించి భాద్యత గల పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.మత్తుకు బానిసలై యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు.ఎవరైనా నిషేదిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ గానీ,విక్రయిస్తూ గానీ పట్టుబడితే అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని,అవసరమైతే పీడియాక్టులను కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.ఎస్పీ జెండాను ఊపి బైకు ర్యాలీని ప్రారంభించారు.1000 మందికి పైగా ఈ ర్యాలీలో స్థానికులు,ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పీ అబ్దుల్ రెహమాన్,కొత్తగూడెం 2టౌన్ సీఐ ప్రతాప్,చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ రాయల వెంకటేశ్వర్లు,1టౌన్ సీఐ కరుణాకర్,లక్ష్మీదేవిపల్లి ఎస్సై రమణారెడ్డి,సుజాతనగర్ ఎస్సై రమాదేవి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >