Posted on 2025-11-13 16:54:59
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాదు లో అత్యంత రద్దీ రోడ్డు అయినా దేవీ రోడ్డు నందు తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతున్నందున ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు గత మూడు నెలల నుంచి వన్ వే ను ట్రాఫిక్ పోలీస్ వారు ప్రారంభించారు. దేవి రోడ్డు యందు పోలీస్ శాఖ విధించిన వన్ వే ఎలా పని చేయుచున్నదని తెలుసుకోవడానికి పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య కాలినడకన గురువారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో దేవీ రోడ్డు వెంట ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కన గల ఫ్లై ఓవర్ నుంచి ఎల్.వి.ఆర్ వరకు గల రోడ్డు, దేవి రోడ్డు నుంచి కిసాన్ గల్లి గంజ్ కు వెళ్లే రోడ్డు, గాంధీ చౌక్ నుంచి గంజ్ వరకు గల రోడ్ల లో కలియ తిరిగి సమీక్షించారు. ఈసమీక్షలో కమిషనర్ ప్రజలతో మమేకమై వన్ వే వలన ఏమైనా ఇబ్బందులు కలుగుచున్నాయా లేదా ఎంత వరకు ప్రయోజనం ఉన్నది తెలుసుకోవడానికి ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు సేకరించారు. అలాగే దేవీ రోడ్డుకు వస్తువులు కొనడానికి నిమిత్తం వచ్చే ప్రజలు మరియు దేవి ఆలయానికి వచ్చే భక్తులు పార్కింగ్ ఎక్కడ చేయుచున్నారని అదేవిధంగా దగ్గరలో గల సెల్లార్లను అదేవిధంగా కాళీ ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి సాధ్యాసాధ్యాలను, బై లెన్లను పరిశీలించారు. ఈ సమీక్షలో సిపి వెంట ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది ఉన్నారు .
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >