| Daily భారత్
Logo




జూబ్లీహిల్స్ ఓటరు మహాశయులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు

News

Posted on 2025-11-14 16:17:40

Share: Share


జూబ్లీహిల్స్ ఓటరు మహాశయులు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారు

ఈ గెలుపు కష్టపడ్డ  ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం

మీడియా సమావేశంలో టీ పీ సీ సీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అంకితమని స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లోను ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తామని వెల్లడించారు.

బీసీ బిడ్డ నవీన్ యాదవ్‌ను గెలిపించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించడం ఖాయమన్నారు.కాంగ్రెస్ పార్టీ కనీసం పదేళ్లు అధికారంలో కొనసాగడం తథ్యమన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పనితీరుపట్ల ప్రజలు సంతృప్తిగా ఉండడం వల్లే భారీ మెజార్టీతో విజయం దక్కిందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేసిన సీఎం రేవంత్ రెడ్డికి పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

జూబ్లీహిల్స్ తీర్పుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందన్న ప్రజల భరోసా కల్పించారన్నారు.

జూబ్లీహిల్స్ తీర్పుతో కాంగ్రెస్ ప్రభుత్వo పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని స్పష్టమైందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ తో ఉందన్నారు.బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి ఈ  తీర్పు తో జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి హెచ్చరిక పంపారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని మరోసారి రుజువైందని, పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు గుండు సున్నాతో బీఆర్ఎస్ భవిష్యత్తును ఖరారు చేశారని పేర్కొన్నారు.. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలు సంతృప్తి చెంది భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపించారని తెలిపారు.

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికల మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు స్పష్టమైన మద్దతు ఇచ్చి ప్రతిపక్షాలకు చెంపపెట్టు వంటి తీర్పు ఇచ్చారని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ విజయం జిహెచ్ఎంసి  ఎన్నికలకు నాంది పలుకుతూ, రానున్న జిహెచ్ఎంసి   ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100కు పైగా సీట్లు గెలవడం ఖాయమని, కనీసం పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో కొనసాగే అవకాశం ఉందని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఈ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి హెచ్చరిక ఇచ్చారని పేర్కొన్నారు.ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సఫలమయ్యారని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు ప్రొద్దుటూరిసుదర్శన్ రెడ్డి, మమ్మద్ షబ్బీర్ అలీ, రూరల్ శాసనసభ్యులు  భూపతి రెడ్డి, తాహిర్ బిన్ హందన్, మానాల మోహన్ రెడ్డి, కేశ వేణు, రత్నాకర్, విపుల్ గౌడ్  తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >
Image 1

ఇంటి వద్దే పాత సోఫాలు, ఫర్నిచర్, పరుపుల సేకరణ

Posted On 2026-07-06 18:24:53

Readmore >
Image 1

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

Posted On 2026-07-06 04:34:19

Readmore >
Image 1

తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Posted On 2026-07-05 16:09:21

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

Posted On 2026-07-05 16:02:47

Readmore >
Image 1

ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలను అందించిన వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-07-05 16:00:41

Readmore >