| Daily భారత్
Logo




సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగులకు గౌరవ భృతి చెల్లింపు కొరకు TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రాతినిథ్యం

News

Posted on 2025-11-18 14:46:08

Share: Share


సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఉద్యోగులకు గౌరవ భృతి చెల్లింపు కొరకు TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రాతినిథ్యం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గత సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో  ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన  సమగ్ర కుటుంబ సర్వేలో మన జిల్లాలోని వివిధ శాఖల ఉద్యోగులు ఉపాధ్యాయులు  రాత్రి, పగలు తేడా లేకుండా ఆదివారాలు, పండుగ రోజుల్లో కూడా బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోపే సర్వే పూర్తి చేశారు. సర్వే చేసిన ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా అతి తక్కువ జీతంతో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, CRP లు, MIS లు, మున్సిపల్ ఉద్యోగులు  సైతం ఉన్నారు. సంవత్సరం కాలం పూర్తి అయినప్పటికీ చెల్లింపు జరగలేదు.  ఈ డ్యూటి చేసిన ఉద్యోగులకు గౌరవ భృతి చెల్లింపు కొరకు జిల్లా యంత్రాంగం బిల్ ప్రిపేర్ చేసి సిరిసిల్ల జిల్లా కోశాధికారి కార్యాలయంలో సమర్పించియున్నారు మరియు ఈ- కుబేర్  కూడా పూర్తి చేసియున్నారు. ఈ కుబేర్ లో  దాదాపు 54 లక్షల రూపాయలు పెండింగ్ లో ఉన్న ఈ బిల్ ఇప్పటికీ కూడా ఆన్లైన్ లో ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉండి ఉద్యోగులకు చెల్లింపు జరుగలేదు.  ఈ విషయంలో  ప్రత్యేక చొరవ తీసుకుని ప్రభుత్వం నుండి నిధులు విడుదల అయేలా చేసి Directorate of Treasuries, Hyderabad నుండి మన జిల్లా లోని విధులు నిర్వహించిన ఉద్యోగులను త్వరగా బిల్ చెల్లింపు చేయుటకు ప్రయత్నం చేయగలరని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ని కలిసి  “తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF)” రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ప్రాతినిథ్యం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TSUTF రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు పర్కాల రవిందర్, ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు, జిల్లా కోశాధికారి అంబటి రమేష్, జిల్లా కార్యదర్శులు మొలిగె శంకరయ్య, గాలిపెల్లి సంతోష్, వద్యారం మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >