Posted on 2025-11-18 16:37:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: "ఏక్ బారత్ - ఆత్మనిర్భార్ భారత్ " సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు సంవత్సరవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా వర్ని చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు ఘనంగా నిర్వహించిన ర్యాలీ కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఈ ర్యాలీ వర్ని చౌరస్తా నుండి మొదలై ప్రధాన రహదారి గుండా నినాదాలు తో కొనసాగి పాత కలెక్టరేట్ భవన ప్రాంగణం లోని సభా ప్రాంగణo వరకు ముగిసింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేడు మనం దేశ నిర్మాణ శిల్పి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంవత్సర వ్యాప్తంగా వారి 150వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని, వర్ని చౌరస్తా నుండి పాత కలెక్టరేట్ వరకు నిర్వహిస్తున్న ఈ మహా ర్యాలీ కోసం ఒకచోట చేరడం ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
సర్దార్ పటేల్ మన స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు, స్వతంత్ర భారత నిర్మాణంలోనూ ఆయన ఎంతో గొప్ప పాత్ర పోషించిన మహానుభావుడు. దేశవ్యాప్తంగా ఉన్న 562 సంస్థానాలను ఒక్క తాటిపైకి తెచ్చి, భారతదేశాన్ని ఏకీకృతంగా నిర్మించడం ఆయన చేసిన అపూర్వ సాహసం. అందుకే ఆయనను “భారత ఐక్యతకు ప్రతీక”గా ప్రపంచం గుర్తిస్తుందన్నారు. మన యువత ఈ మహనీయుని ఆలోచనలను, ప్రేరణను తమ జీవితంలో కలుపుకోవాలి. ఆయన చూపిన ధైర్యం, క్రమశిక్షణ, దేశభక్తి ఈరోజు మనందరికీ అత్యంత అవసరం అని అన్నారు.
మన సమాజంలో ఐక్యత, సమానత్వం, శాంతి, సోదరభావం పెంపొందించడంలో మీలో ప్రతి ఒక్కరి పాత్ర విలువైంది అని అన్నారు. ఈ ర్యాలీ ద్వారా మనం కేవలం సర్దార్ పటేల్ ని స్మరించుకోవడం మాత్రమే కాదని, అయన చూపిన మార్గాన్ని అనుసరించేందుకు ప్రజలకు సందేశం పంపుతున్నామన్నారు.
దేశం కోసం, సమాజం కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం మనమందరం ఒకటై ముందుకు సాగాలని ప్రతిజ్ణ చేశారు. ఈ కార్యక్రమం లో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి,మేరా యువ భారత్ జిల్లా అధికారి షైలా బెలాల్,మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబు, పోతంకర్ లక్ష్మీనారాయణ,బీజేపీ నాయకులు, విద్యార్థులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >