| Daily భారత్
Logo




హత్య కేసులో 9 మంది నిందితుల రిమాండ్

News

Posted on 2025-11-20 10:13:07

Share: Share


హత్య కేసులో 9 మంది నిందితుల రిమాండ్

సాంకేతికతో నేరాల చేదన

సాంకేతిక ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తి హత్యకేసు చేదించిన సూర్యాపేట రూరల్ పోలీస్

హైద్రాబాద్ లో హత్య చేసి సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతుడి శవాన్ని వదిలేసిన నిందితులు

నేరస్తుల వేలిముద్రల డేటా బేస్ ఆధారంగా మృతుడి గుర్తింపు.

బంధువులే ఉమ్మడి పథకం ప్రకారం హత్య చేశారు.

హైదరాబాద్ జీడిమెట్లలో నిందితుల అరెస్ట్.

కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.

డైలీ భారత్ న్యూస్, సూర్యాపేట:ఈనెల 15వ తేదీన సూర్యాపేట రూరల్ పరిధి టేకుమట్ల నుండి ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి గ్రామ శివారులో సుమారు 50 సంవత్సరాలు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సూర్యాపేట రూరల్ పోలీసులు గుర్తించారు. ఈ గుర్తుతెలియని మృతి దేహం కేసులో క్లూస్ టీమ్ సిబ్బంది ఫింగర్ ప్రింట్ డేటా బేస్ లో ఉన్న నేరస్తుల వేలిముద్రల ఆధారంగా మృతుడుని గుర్తించడం జరిగినది. మృతిని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఫింగర్ ప్రింట్స్, సిసిటీవీ ప్యూటేజి సాంకేతిక అధారలో ఈ కేసులో 9 మంది నిందితులను గుర్తించి హైద్రాబాద్, జీడిమెట్ల లో అరెస్టు చేయడం జరిగింది. హత్యకు వినియోగించిన రెండు కార్లు, తాళ్లు, యాసిడ్ క్యాన్, క్లాత్, 10 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. కేసు వివరాలు, అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

నిందితులు అంతా దగ్గరి బంధువులు అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అమలాపురం మండలంకు చెందినవారు. ప్రస్తుతము హైదరాబాదులో నివాసం ఉంటున్నారు.

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి టేకుమట్ల నుండి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి పై పిల్లలమర్రి గ్రామ శివారులో రోడ్డు పక్కన అనుమానస్పద స్థితిలో ఉన్నటువంటి సుమారు 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతి దేహాన్ని సంచిలో కట్టి చిన్న కాలువలో పడేశారు,  ఈ సమాచారంపై సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్, సూర్యాపేట రూరల్ ఎస్సై పోలీస్ టీం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేయడం జరిగినది. జిల్లా క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించడం జరిగినది. ఈ వ్యక్తిని ఎక్కడో చంపి తీసుకొచ్చి సూర్యాపేట రూరల్ పరిధి జాతీయ రహదారి వెంట పడవేసి ఆనవాళ్లు గుర్తుపట్టకుండా యాసిడ్ పోసి వదిలేసి వెళ్లినట్లు ప్రాథమికంగా అంచనాకు రావడం జరిగింది. పోలీసు వద్ద ఉన్న సాంకేతికత ఆధారంగా ఫింగర్ ప్రింట్ డాటా బేస్ మృతుని వేలిముద్రలను పోల్చగా మృతుడు గతంలో నేరస్తుడు కాగా వేలిముద్రల ఆధారంగా మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా అమలాపురం మండలం చెందిన నాగవరపు సత్యనారాయణ @ సత్తిబాబు గా గుర్తించడం జరిగినది. బంధువులకు సమాచారం ఇవ్వగా తల్లి ఫిర్యాదు మేరకు కేసును దర్యాప్తు చేయడం జరిగినది.  మృతుడు 2023 సంవత్సరం జూలై నెల 15 వ తేదిన హైదరాబాద్, బోయినపల్లిలో బామర్ధి గెళ్లా కిరణ్ ఇంట్లో భార్యతో గొడవపడి కత్తితో దాడి చేసి భార్య ఝాన్సీరాణిని చంపి, బావమార్థి భార్య గల్లా షీలా ను గాయపరిచిన హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించడం జరిగినది. మృతిడు బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో విచారణ ఖైదీగా జైలుకు వెళ్లినాడు.  ఈకేసులో ఈనెల ఆరో తారీఖున జైలు నుంచి బెయిల్ పై విడుదలై  అయ్యే తేదీలను, కోర్టుకు హాజరయ్యే తేదీలను మృతుడి బామ్మర్ది ఐన A1 నిందితుడు గెల్లా కిరణ్, అతని బంధువులు గుర్తుపెట్టుకున్నారు.

అట్టి కేసు విచారణకు రాగా కోర్ట్ లో సత్యనారాయణ కు వ్యతిరేకంగా కిరణ్, అతని బార్య , మిగతా సాక్షులు సాక్ష్యము చెప్పినారు. అట్టి కేసు విచారణలో ఉండగా తేదీ 06.11.2025 న సత్యనారాయణ బెయిల్ పై వచ్చి  తేదీ 07.11.2025 రోజు కరక్కాయ పేట కు వెళ్ళి, కరక్కాయ పేట లోని కిరణ్ ఇంట్లో అద్దెకు ఉండే ఏ3 దొండపాటి విశ్వనాధం తో కేసులో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన అందరినీ చంపుతాను అని తెలపగా, ఈ విషయాన్ని  విశ్వనాధం ఏ1 కిరణ్ కు  ఫోన్ చేసి చెప్పినాడు. సత్యనారాయణ బ్రతికి ఉంటే తమని చంపుతాడు అని సత్యనారాయణ ను చంపాలని  ఏ1 కిరణ్, కిరణ్ పెద్ద అక్క ఏ6 చీకురుమిల్లీ అమ్మాజి, బావ ఏ2 చీకురుమిల్లీ మాధవరావు, వారి కొడుకు ఏ4 శశికుమార్ @ శశి, కూతురు ఏ5 మౌనిక, కిరణ్ మేన మామ ఏ7 నేతల సర్వేశ్వర రావు, కిరణ్ భార్య ఏ9 శీల, కిరణ్ ఇంట్లో అద్దెకు  ఉండే విశ్వనాధం కలిసి సత్యనారాయణ కోర్ట్ వాయిదాకు హైదరాబాద్ కు వచ్చినప్పుడు హత్య చేయాలని నిర్ణయించుకొని తేదీ 14-11-2025 రోజు  సత్యనారాయణ సికింద్రాబాద్ కోర్టుకు వాయిదాకు వెళ్ళగా అక్కడికి కిరణ్, చీకురుమెల్లి  మాధవరావు,   అతని కొడుకు  శశి, అతని కూతురు మౌనిక, విశ్వనాధం లు కార్లలో కోర్ట్ వద్దకు వెళ్ళి సత్యనారాయణ కోర్టు లోనుండి బయటకు వచ్చి వీరిని చూసి భయముతో వేగంగా నడ్చుకుంటూ వెళ్లిపోవుచుండగా  మాధవరావు కారులో మాధవరావు, కిరణ్, మౌనిక, విశ్వనాధం, శశి  వెంబడించి సత్యనారాయణ ను పట్టుకొని కారు లో వేసుకొని కొద్ది దూరం వెళ్ళినాక కిరణ్  మేనమామ సర్వేశ్వర్ రావుకు ఫోన్ చేసి సత్యనారాయణ దొరికిన విషయము తెలిపి అతనిని  యాసిడ్ క్యాన్ తీసుకొని రమ్మని చెప్పగా అతను తన కారు డ్రైవరు ఏ8 గిడ్డి రమేష్ ను యాసిడ్ కారును తీసుకొని వచ్చినాడు. సత్యనారాయణ ను కారులో గొంతు పై కాలు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినారు. అతన్ని హత్య చేయకంటే ముందే మౌనిక చర్లపల్లి వద్ద కారు దిగి ఇంటికి వెళ్లిపోయినది. సత్యనారాయనను హత్య చేసిన విషయము ఫోన్ ద్వారా అమ్మాజికి, షీల కు, మౌనీకకు తెలిపినారు. హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డుపై నుండి కారులో వచ్చి సత్యనారాయణ శవాన్ని పిల్లలమర్రి శివారులోని ఖమ్మం వెళ్లే జాతీయరహదారిపై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి పిల్లలమర్రి గ్రామ శివారులో రోడ్డు ప్రక్కన  ఉన్న చిన్న కాలువలో పడవేసి అతన్ని గుర్తు పట్టకుండా ఉండటానికి శవముపై యాసిడి పోసి అక్కడి నుండి విజయవాడ వెళ్ళి మరుసటి రోజు హైదరాబాద్ వెళ్ళినరు. తేదీ 19.11.2025 రోజు సాయంత్రము నేరస్తులు అందరూ హైదరాబాద్ లోని జీడిమెట్ల లోని సర్వేశ్వర రావు ఇంట్లో ఉండగా పట్టుబడి చేయనైనది. 

వీరి నుండి నేరానికి ఉపయోగించిన ఎర్టీగా కారు, కీయా కారు, రెండు తాల్లు, ఒక క్లాత్, ఖాళీ యాసిడ్ క్యాన్, 10 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకోవడం జరిగినది. అరెస్టు చేయబడిన 9 మంది నిందితులపై గతంలో ఎలాంటి నేరచరిత్ర గుర్తించబడలేదు. మృతునిపై బోయినపల్లి పోలీస్ స్టేషన్ నందు ఒక హత్య కేసు, ఆంధ్రప్రదేశ్ అమలాపురం పోలీస్ స్టేషన్ నందు నాలుగు దాడి కేసులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది.

నిందితులు

ఏ-1 గెల్లా కిరణ్ వయసు 40 సంవత్సరాలు వృత్తి ఇంజనీరింగ్ వర్క్ కరక్కాయ పేట అమలాపురం మండలం కోనసీమ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుత నివాసం నేరేడ్మెట్ హైదారాబాద్.

ఏ-2 చీకూరు మెల్లి మాధవరావు 48 సంవత్సరాలు వృత్తి ఎలక్ట్రిషన్, ఆంధ్రప్రదేశ్,  కోనసీమ జిల్లా. ప్రస్తుత నివాసం చిలకానగర్, నాచారం, హైదరాబాద్.

ఏ-3 దొండపాటి విశ్వనాథం 49 సంవత్సరాలు, వ్యవసాయం వృత్తి, ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లా అమలాపురం మండలం.

ఏ-4 చీకురుమల్లి శివకుమార్ 23 సంవత్సరాలు, వృత్తి విద్యార్థి  ఆంధ్రప్రదేశ్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం, ప్రస్తుత నివాసం నాచారం హైదరాబాద్.

ఏ-5  చీకురుమల్లి మౌనిక 24 సంవత్సరాలు మృతి విద్యార్థి ప్రస్తుత నివాసం హైదరాబాద్. 

ఏ-6 చీకురుమల్లి అమ్మాజీ, 46 సంవత్సరాలు వృత్తి టైలరింగ్ ప్రస్తుత నివాసం హైదరాబాద్. 

ఏ-7 నేతల సర్వేశ్వరరావు 46 సంవత్సరాలు వృత్తి బిజినెస్, కోనసీమ జిల్లా అమలాపురం మండలం ప్రస్తుత నివాసం బాలానగర్, హైదరాబాద్. 

ఏ-8 గిడ్డి రమేష్ 33 సంవత్సరాలు వృత్తి డ్రైవర్, కోనసీమ జిల్లా, అమలాపురం మండలం ప్రస్తుత నివాసం కుతుబుల్లాపూర్, హైదరాబాద్. 

ఏ-9 గేల్లా షీలా, వయసు 43 సంవత్సరాలు వృత్తి ప్రైవేటు ఉద్యోగము కోనసీమ జిల్లా అమలాపురం మండలం ప్రస్తుత నివాసం, నేరేడ్మెట్ హైదరాబాద్.

ఈ ఈ కేసు చేదనలో బాగా పనిచేసినటువంటి క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ సిబ్బందిని, సూర్యాపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ను, ఎస్ఐ బాలు నాయక్, పెనపహాడ్ ఎస్ఐ గోపి కృష్ణ ను, పర్యవేక్షణ చేసిన సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ ను, సిబ్బందిని ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు అభినందించి రికార్డ్స్ అందించారు.

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >