| Daily భారత్
Logo




యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

News

Posted on 2025-11-20 11:10:46

Share: Share


యాసిడ్ ట్యాంకర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ వస్తుండగా జడ్చర్ల వద్ద ఘటన

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారి ఫ్లై ఓవర్పై ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది.

ఈ ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. యాసిడ్ ట్యాంకర్ నుంచి పొగలు వచ్చాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది పొగలను అదుపులోకి తీసుకు వచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు.

జగన్ ట్రావెల్స్ బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే పబ్లిక్ బిక్కుబిక్కుమంటున్నారు. జగన్ ట్రావెల్స్ బస్సులో ఉన్న ప్రయాణికులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెప్పుకొచ్చారు.

వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుకు కూడా హైదరాబాద్లో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట్ ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే ఓవర్​ హీట్ కారణంగా బస్సు టైర్లలో నుంచి పొగలు వచ్చాయి. దీంతో డ్రైవర్ పక్కకు ఆపాడు. మరో బస్సు అరేంజ్ చేస్తామని చెప్పడంతో 26 మంది ప్రయాణికులు తీవ్ర చలిలో రోడ్డు పైనే వేచివున్నారు. గంటల తరబడి చలిలో ఇబ్బంది పడినా వేమూరి ట్రావెల్స్ యాజమాన్యం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >