Posted on 2025-11-20 15:52:01
ఈనెల 23న జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రాజకీయాలకు అతీతంగా అందరికీ ఆహ్వానం అందించాం
మాజీ తొలి మేయర్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా మున్నూరు కాపుల సంఘ బలోపేతం కోసం తమ తండ్రి మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ధర్మపురి శ్రీనివాస్ కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా అన్ని వర్గాలను కలుపుకుపోతూ అందరికీ న్యాయం చేయాలని ఉద్దేశంతో పనిచేస్తూ వెళ్లారని మాజీ మేయర్, మున్నూరు కాపు నూతన జిల్లా అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వినాయక నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఉన్న సమయంలో మున్నూరు కాపుల అభివృద్ధి కోసం ఎంతగానో పనిచేశారని, అలాగే మున్నూరు కాపు కులస్తులను అందరిని సంఘటితం తీసుకురావడానికి ఎనలేని కృషి చేశారని ఆయన కొనియాడారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇకపై కూడా బాధ్యతతో పనిచేస్తానని ఆయన అన్నారు. ఈనెల 23వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధికార పార్టీ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు రావడమే కాకుండా, బిజెపి పార్టీ నుండి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కూడా ఆహ్వానించబోతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి కూడా కీలక ముఖ్య నేతల తో పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా మున్నూరు కాపు అధ్యక్షులు, కార్యవర్గ కమిటీ, తోపాటు కుల బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >