Posted on 2025-11-20 19:30:50
నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలింపు
వివరాలు వెల్లడించిన సిరిసిల్ల రూరల్ సి.ఐ మొగిలి
డైలీ భారత్ న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పిట్ల శ్రీకాంత్ అనే వ్యక్తి కార్(TS 07 HJ 6969) కు తేదీ 19.11.2025 రోజున మధ్యాహ్నం సమయంలో ఇల్లంతకుంట నుండి సిరిసిల్ల వెళ్తున్న సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఎవ్వలేదని కారును కొంత దూరం వెళ్లిన తర్వాత తిప్పుకొని వచ్చి ఆర్టీసీ బస్సుకు కారును అడ్డుగా నిలిపి బస్సు డ్రైవర్ బాలరాజును దుర్భాషలాడి బస్సు డ్రైవింగ్ క్యాబిన్లోకి వచ్చి డ్రైవర్ అయిన కల్లూరి బాలరాజును కొట్టి, బస్ అద్దాన్ని పగలగొట్టడానికి రాయితో విసరగా అద్దం పగిలి రోడ్డుకు పక్కన కూర్చున్న వల్లంపట్ల గ్రామానికి చెందిన సండి వజ్రవ్వ మోకాలిపై గాయం తగిలింది.ఘటనను ప్రశ్నించిన ఓబులాపూర్ గ్రామానికి చెందిన ప్రయాణికురాలు బత్తుల రాజవ్వతో కూడా నిందితుడు వాగ్వాదానికి దిగాడు.
మొత్తం ఘటనను బస్సు కండక్టర్ తన మొబైల్ ఫోన్‌లో వీడియోగా రికార్డు చేయగా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిందితుడు నిన్నటి నుండి పరారీలో ఉండగా,దాడికి గురైన డ్రైవర్ బాలరాజు ఫిర్యాదు మేరకు ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌లో నిన్నటి రోజున కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట ఎస్.ఐ అశోక్ ఆధ్వర్యంలో మూడు టీమ్ లు ఏర్పాడి సాంకేతికత ఆధారంగా ఈరోజు సాయంత్రం రహీంఖాన్ పేట గ్రామ శివాలో నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీ గురించి రిమాండ్ కు తరలించడం జరిగిందని సి.ఐ మొగిలి తెలిపారు..
నిందుతుని వివరాలు.
1.పిట్ల శ్రీకాంత్ తండ్రి: ఎల్లయ్య నివాసం:గంగాపూర్ గ్రామం , చిన్నకోడూరు మండలం,సిద్దిపేట జిల్లా.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >