Posted on 2025-12-04 08:12:41
డైలీ భారత్ డెస్క్; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని, జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టియుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం టియుడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో హైదరాబాద్, మాసబ్ ట్యాంక్ లోని సమాచార శాఖ కార్యాలయం వద్ద జరిగిన మహాధర్నా విజయవంతం అయిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులంతా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయ్యిందని, అయినప్పటికీ కొత్త అక్రిడియేషన్ కార్డులు ఇవ్వడం లేదని, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించడం లేదని హెల్త్ కార్డులను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. దీనికి తోడు జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలను వేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. జర్నలిస్టులను విస్మరించడం తగదన్నారు. గొంతెమ్మ కోరికలను జర్నలిస్టులు కోరడం లేదని గతంలో అమలు చేసిన వాటినే సంపూర్ణ స్థాయిలో అమలు చేయాలని అడగడం తప్పా? అని ప్రశ్నించారు. జర్నలిస్టుల్లో అనేకమంది పేద మధ్యతరగతి వర్గాల వారు ఉన్నారని వారంతా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇబ్బందులు పడుతున్న సంగతిని గుర్తించాలన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని మహా ధర్నా ద్వారా వారు మేల్కొవాలని చెప్పారు. తక్షణమే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని కొత్త అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలని ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >