Posted on 2025-12-05 11:53:23
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:అవినీతి లేని సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుండి సాయ రెడ్డి పెట్రోల్ బంక్ వరకు చేపట్టిన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్యాలయాల్లో అధికారులు ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడకుండా నిబద్ధతతో పనిచేసినప్పుడే సమాజం బాగుపడుతుందని అలాగే దేశం అభివృద్ధి బాటన నడుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు లంచాలకు అవినీతికి పాల్పడకుండా ప్రభుత్వం తమకు నిర్దేశించిన పనుల్లో పనిచేసి ప్రభుత్వం ఇచ్చే వేతనాలతో నే సరి పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల చేతిలో చిక్కడం హేయమైన చర్య అని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సాధారణ పౌరులు పనులు జరుగుతాయని ఆశతో వచ్చిన వారికి వీలైనంత త్వరగా వారి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలి తప్ప వారిని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ పదేపదే తిప్పించుకోవడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. ఈ ర్యాలీలో బసవ రెడ్డి, ఏసీబీ డిఎస్పి శేఖర్ గౌడ్, ఏసీబీ సిబ్బంది అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >