| Daily భారత్
Logo




2047 నాటికి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ : మంత్రి వాకిటి శ్రీహరి

News

Posted on 2025-12-09 22:40:23

Share: Share


2047 నాటికి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ : మంత్రి వాకిటి శ్రీహరి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ మత్స్య సంపదను 2047 నాటికి అగ్ర భాగాన నిలబెడతామని సదస్సులో రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక,మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గోదావరి, కృష్ణ నదుల మధ్య ఉన్న తెలంగాణలో 26 వేల నీటి వనరులు కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద ఉత్పత్తి కి చాలా అనుకూలమైన ప్రదేశమని రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అన్ని రిజర్వాయర్లు చెరువులల్లో 122 కోట్ల బడ్జెట్ తో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేశామన్నారు. చెరువులలో చేప పిల్లలను ఒక నిష్పత్తి ప్రకారం వదలడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఈ సంవత్సరం 8 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మత్స్య సంపద ద్వారా రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందన్నారు.మత్స్య పరిశ్రమలో ఐదు లక్షల కుటుంబాలు జీవనోపాధి కొనసాగిస్తుందని.రాష్ట్రంలో పాల ఉత్పత్తిలో విజయ డైరీ ని మరింత ఆధునీకరిస్తామన్నారు. రాష్ట్రంలో రోజుకు 95 లక్షల లీటర్ల పాలు అవసరం ఉండగా ప్రస్తుతం 35 లక్షల లీటర్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతుందని తెలిపారు. దీనిని అధిగమించడానికి రైతులకు పాల ఉత్పత్తి పెంచే గేదెలను ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.రాష్ట్రానికి సరిపోయి మిగతా పాలను దేశంలో వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు పిలుపునిచ్చారు.రాష్ట్రంలో డైరీ సెక్టార్ లో బిజినెస్ కు అపార అవకాశాలు ఉన్నాయని పాల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, నిఖిల ఐ.ఏ.ఎస్, గోపి ఐ.ఏ.ఎస్, చంద్రశేఖర్ రెడ్డి ఐ.ఏ.ఎస్,శ్రీనివాస్ - ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అడ్వైజర్, విజయ్ గుప్త, జె ఎస్ యాదవ్ ఎం డీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అగ్రికల్చర్, ఎ కె సింగ్ హార్టికల్చర్ ఐసిఎఆర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >