| Daily భారత్
Logo




తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు 4కోట్ల బిడ్డల భావోద్వేగం : సీఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2025-12-09 22:42:20

Share: Share


తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు 4కోట్ల బిడ్డల భావోద్వేగం : సీఎం రేవంత్ రెడ్డి

డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల కలెక్టరేట్ల ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను విర్చువల్‌గా ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమ్మిట్ -2025 జరుగుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఏర్పాటు చేసిన కార్యక్రమం నుంచి తెలంగాణ తల్లి విగ్రహాలను మంగళవారం ఆవిష్కరించారు.రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , ఇతర మంత్రివర్గ సహచరుల సమక్షంలో గ్లోబల్ సమ్మిట్ వేదికగా జరుపుకోవడం శుభ పరిణామమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు గ్లోబల్ సమ్మిట్‌కు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు, దేశ పారిశ్రామిక వేత్తలకు ఈ సందర్బంగా తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ ఆవిష్కరణ సందర్బంగా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ప్రజల ఆలోచనలను, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రతినిత్యం తెలంగాణ తల్లిని స్ఫూర్తిగా తీసుకుని, ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ఒక బలమైన సంకల్పంతో నిర్ణయం తీసుకుని ఈ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టింది.యూపీఏ చైర్‌పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ  ఆధ్వర్యంలో ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్  నేతృత్వంలోని ప్రభుత్వం 9 డిసెంబర్ 2009 న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన మంచి రోజు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తూ తీసుకున్న ఆ నిర్ణయం ఈ ప్రాంత ప్రజలకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఆత్మగౌరవాన్ని అందించాయి.తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిసెంబర్ 9 కి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి 60 సంవత్సరాల ప్రజల బలమైన ఆకాంక్షను నెరవేర్చిన పర్వదినాన్ని తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించి,  ప్రతి ఏటా డిసెంబర్ 9 తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలను జరుపుకుంటున్నాం.గతేడాది రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయంలో ఆవిష్కరించుకుని ఒక స్ఫూర్తిని తీసుకొచ్చాం. ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్లలో ఆవిష్కరించుకున్నాం. స్వరాష్ట్ర కల నిజమై, తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు నిటారుగా నిలబడి సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటున్నది అని ముఖ్యమంత్రి అన్నారు.

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >