Posted on 2025-12-19 22:05:24
డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పిఎసిఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాలను రద్దు చేసింది. ఆగష్టు 14వ తేదీనే వీరి పదవీకాలం ముగిసినట్లు పేర్కొంది. వీరితో పాటు తొమ్మిది జిల్లాల డీసీసీజీలను కూడా తొలగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.కాగా, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సహకార సొసైటీల నిర్వహణకు ఎన్నికల ద్వారా పాలకవర్గాలను నియమిస్తుంది. సొసైటీల సామర్థ్యాలకు అనుగుణంగా ఒక చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు ఉంటారు. ఎన్నికైన పాలకవర్గాలు ప్రభుత్వం ద్వారా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అమలయ్యే పథకాలను అందిస్తాయి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా పాలకవర్గాలను ప్రభుత్వం నియమిస్తుంది. గత కేసీఆర్ ప్రభుత్వంలో 2020 ఫిబ్రవరి 13న వీటికి ఎన్నికలు జరిగాయి. వీటి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఫిబ్రవరితో ముగిసిన పదవీ కాలాన్ని 6 నెలలపాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా ముగియడంతో తాజాగా పాలకవర్గాలను రద్దు చేసింది.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >