Posted on 2025-12-24 19:54:53
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పక్కా సమాచారంతో పకడ్బందీగా తెల్లవారుజామున తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని ఏ సమయంలో ఎక్కడికి వెళ్తాడో గ్రహించి ఇంటి తాళాలు పగలగొట్టి రూ. 5 లక్షల నగదు, 4 తులాల బంగారం, కిలోన్నర వెండి దోచుకెళ్లారు. బాధితుడు వన్నాడ అశోక్ గౌడ్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షాద్ నగర్ మున్సిపాలిటీ గంజ్ రోడ్ లో నివాసముంటున్న అశోక్ తన పిల్లల ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాదుకు కుటుంబాన్ని తరలించారు. పట్టణంలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే అశోక్ గౌడ్ వారంలో ఒకటి రెండు రోజులు హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. సోమవారం సాయంత్రం ఎప్పటిలాగే హైదరాబాద్ కు వెళ్లి మంగళవారం ఉదయం ఇంటికి వచ్చిన అశోక్ గౌడ్ ఇంటి తాళాలు పగలగొట్టబడి ఉండడం చూసి దొంగతనం అయిందని గ్రహించాడు. బీరువాలో దాచిన రూ. 5 లక్షల నగదు, 4 తులాల బంగారం, కిలోన్నర వెండి చోరీ కీ గురైందని గ్రహించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దొంగ ధ్వంసం చేశాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటలకు ముసుగు ధరించిన ఓ వ్యక్తి ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడగా, ఓ మహిళ కాపలాగా ఉన్నట్టు కాలనీ లోని పలు సీసీ కెమెరాలో నమోదయింది. సంఘటన స్థలాన్ని క్లూస్ టీం పరిశీలించి ఆధారాలను సేకరించింది.
మధ్యప్రదేశ్‌లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >
జినుగు దావీదు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
Posted On 2026-06-26 19:31:31
Readmore >
రాజన్న సిరిసిల్ల: అడవులు ఉంటేనే జీవం... డ్రోన్‌తో విత్తనాలు చల్లుతున్న 7వ తరగతి చిన్నారి
Posted On 2026-06-26 19:19:45
Readmore >
మొహర్రం పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన యువజన నాయకుడు రామిశెట్టి వంశీ
Posted On 2026-06-26 12:01:33
Readmore >