| Daily భారత్
Logo




నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్న దొంగలు..

News

Posted on 2025-12-27 09:17:50

Share: Share


నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెచ్చిపోతున్న  దొంగలు..

జిల్లా కేంద్రంలో రెండు ఏటీఎంలో చోరీకి యత్నించిన దుండగులు సుమారు 50 లక్షల నగుదును కాల్చి బూడిద చేసిన వైనం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార దుకాణాలు, ఇక మొన్నటికి మొన్న జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శంభుని ఆలయంలోకి ప్రవేశించి అందులో ఉన్న సామాగ్రిని దొంగలించిన ఘటన తెలిసిందే.. ఇక ఏటీఎంల లో ఉన్న డబ్బులు దొంగిలించడానికి దొంగలు చేయని ప్రయత్నాలు లేవు. నిత్యం ఎక్కడో చోట ఏటీఎంలో చోరీకి పాల్పడుతున్న ఘటనలు అనేకం.  ముఖ్యంగా చైన్​ స్నాచింగ్స్​ ఘటనలు ఎక్కువగా ఉంటున్నాయి.  తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనే కలకలం రేపుతున్న  నిజామాబాద్​ జిల్లాలో భారీ చోరీ ఘటన అందరినీ విస్మయపరుస్తుంది. కేవలం ఒకేరోజు రెండు ఏటీఎంలలో చోరీకి యంత్రించిన దుండగులు.. యంత్రాలు తెరుచోకపోవడంతో వాటిని తగలబెట్టారు. దీంతో రెండింట్లోని సుమారు రూ. 50 లక్షలకు పైగా నగదు చిత్తు కాగితాలగా కాలి బూడిదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దుండగులు ఏటీఎంల చోరీకి పాల్పడ్డారు.  బైక్ పై వచ్చిన దొంగలు ఎస్బిఐ బ్యాంక్ కు చెందిన  ఏటీఎం కేంద్రంలోకి చొరబడ్డారు. అక్కడ ఉన్న యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు కాజేయాలని ప్రయత్నించారు. అది తెరుచుకోకపోవడంతో దానిని తగలబెట్టారు. దీంతో ఏటీఎంలోని సుమారు రూ. 27 లక్షల నగదు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో ఏటీఎంలోనూ చోరీ జరిగింది. ఇక్కడి ఏటీఎం కూడా తెరుచుకోకపోవడంతో దానిని కూడా దుండగులు తగలబెట్టారు. ఇందులో ఉన్న దాదాపు రూ. 25 లక్షల నగదును దోచుకున్నారు. ఈ నేపథ్యంలో, ఒకేరోజు రెండు ఏటీఎంల చోరీ ఘటనలు జరగడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.  సంఘటన స్థలాలను డీసీపీ బసవ రెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు బైక్​పై, కారులో రెక్కీ నిర్వహించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >