| Daily భారత్
Logo




జీవో 252 ను వ్యతిరేకంగా డెస్క్‌ జర్నలిస్టుల నిరసన

News

Posted on 2025-12-27 21:53:49

Share: Share


జీవో 252 ను వ్యతిరేకంగా డెస్క్‌ జర్నలిస్టుల నిరసన

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్:తమకు పాతపద్ధతిలోనే అక్రెడిటేషన్‌ కార్డులు ఇవ్వాలని డెస్క్‌ జర్నలిస్టులు ఆందోళనకుదిగారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్తగాతెచ్చిన జిఓ 252 జర్నలిస్టుల ను విభజించేవిధంగా ఉందని శనివారం నిజామాబాద్‌ జిల్లాకలెక్టరేట్‌ వద్ద డీజేఎఫ్ టీ (ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా) శాఖ ఆధ్వర్యంలో నిరసనతెలిపారు. ఈ సందర్భంగా డెస్క్‌ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రభుత్వం డెస్క్‌జరల్నిస్టులకు అన్యాయం చేయాలని చూస్తోందన్నారు. ఇందుకోసమే జీవో 252నుతీసుకువచ్చిందని ఆరోపించారు. అక్రెడిటేషన్‌ కార్డు, మీడియా కార్డు పేరుతో జర్నలిస్టులను విడదీయాలనికుట్ర పన్నిందని మండిపడ్డారు. తమ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మరీ రాత్రి సమయంలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.విలేకరులు, డెస్క్‌ జర్నలిస్టులు కలిసి పనిచేస్తేనే జర్నలిజం అవుతుందన్నారు. కానీ సర్కారుమాత్రం వివక్ష చూపిస్తోందని.. ఇది సరైనది కాదని పేర్కొన్నారు. జీవో 252ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే అక్రెడిటేషన్‌ కార్డులు ఇవ్వాలనిడిమాండ్‌ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన తప్పదని హెచ్చరించారు.  అనంతరం కలెక్టరేట్‌ ఏవో ప్రశాంత్ కు వినతిపత్రం అందజేశారు. డెస్క్‌జర్నలిస్టుల కు వివిధ యూనియన్ ల మద్దతు...డెస్క్‌జర్నలిస్టుల ఆందోళనకు వివిధ జర్నలిస్టు సంఘాలు మద్దతు తెలిపాయి. అనంతరం ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్నతెలంగాణ జర్నలిస్టులకు అన్యాయం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. డెస్క్ లో ఉండి వార్తలు వ్రాసే వారే అసలైన వారని, వారు రాసిన వార్తను మరునాడు వివిధ దినపత్రికల్లో ప్రచురింపబడతాయని ఆయన తెలియజేశారు. ఈ క్రమంలో వివిధ దినపత్రికల్లో డెస్క్ లో పనిచేసే ఉద్యోగులపై ప్రభుత్వం పునారాలో చేయాలన్నారు.  సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితోపాటు ఐ అండ్‌ పీఆర్‌ ఉన్నతాధికారులను కలిసి విన్నవించామని పేర్కొన్నారు. కార్యక్రమంలోవివిధ సంఘాల నాయకులు జమాల్‌పూర్‌ గణేశ్‌, భద్రారెడ్డి, సుభాష్‌, పంచరెడ్డిశ్రీకాంత్‌, భూపతి, సీనియర్‌ జర్నలిస్టులు, డెస్క్‌ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >