Posted on 2025-12-28 08:51:45
శివరాత్రికి రాజన్నపై కొత్త భక్తి గీతం విడుదల చేస్తానని ప్రకటన.
డైలీ భారత్, వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని ప్రముఖ గాయకుడు కాసాల నర్సిరెడ్డి అలియాస్ నల్లగొండ గద్దర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని గద్దర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా నల్లగొండ గద్దర్ మాట్లాడుతూ, శ్రీ రాజరాజేశ్వర స్వామిపై తాను పాడిన భక్తి కీర్తనలను గుర్తు చేసుకున్నారు. అలాగే రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజన్నపై కొత్త భక్తి గీతాన్ని విడుదల చేస్తానని ప్రకటించారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >