| Daily భారత్
Logo




టీజీఐఐసీ ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

News

Posted on 2026-01-10 06:56:57

Share: Share


టీజీఐఐసీ ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రారంభించిన  సీఎం రేవంత్ రెడ్డి

పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోందన్నారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు.  తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భావనగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషం, గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశామని తెలిపారు.

క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుందని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి  3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ పై ఆధారపడి ఉంటుందని, ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్, తెలంగాణ పోటీ పడుతోందని, జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో తెలంగాణ పోటీ పడుతోంది అందులో భాగంగా యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు.  దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచమే మనవైపు చూసేలా

ఫార్మా రంగంలో రాణిస్తున్నామని, మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని తెలిపారు. ఇది మనకు ఎంతో గర్వకారణం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను

ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా? నీళ్లు కావాలా? అని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటా, వివాదం కావాలా? పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటా నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ది పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు 

రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు.  మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు అడ్డంకులు పెట్టకండి అడ్డంకులతో కేంద్ర ప్రభుత్వ నిధులు రావడంలేదు, రాష్ట్రంపై ఆర్ధిక భారం పడుతోంది మేం వివాదం కోరుకోవడంలేదు, 

పరిష్కారం కోరుకుంటున్నాం రాజకీయ ప్రయోజనాలు కాదు ప్రజల ప్రయోజనాల కోసం, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నామని అన్నారు.తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయి పక్క రాష్ట్రాలతో మేం వివాదాలు కోరుకోవడం లేదు అది ఏపీ అయినా,  కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా పరస్పర సహకారమే కోరుకుంటున్నాం రాబోయే పదేళ్లల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఉంటున్నామని గర్వంగా చెప్పుకునేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర పరిశ్రమలు & ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, టీజీ ఐఐసీ చైర్మన్ టి.నిర్మల జగ్గారెడ్డి , చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి,

మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ లు పట్నం సునీత మహేందర్ రెడ్డి, తీగల అనిత హరినాథ్ రెడ్డి,  ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మల్ రెడ్డి రంగారెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి టిజిఐఐసి వైస్ ఎండి శశాంక (ఐఏఎస్), డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షహనావాజ్ ఖాసీం,పట్నం రినీష్ రెడ్డి,మనీషా రెడ్డి,టీయూఎఫ్ఐడిసి ఛైర్మన్ చల్లా నర్సింహా రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >