| Daily భారత్
Logo




టాటా రతన్ సేవా స్పూర్తితో ముందుకు సాగుతున్న టాటా ఏఐఏ

News

Posted on 2026-01-10 17:28:29

Share: Share


టాటా రతన్ సేవా స్పూర్తితో ముందుకు సాగుతున్న టాటా ఏఐఏ

వృద్ధులు–వికలాంగుల ఆశ్రమానికి బైక్ ర్యాలీ, దుప్పట్లు–దుస్తుల పంపిణీ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టాటా రతన్ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని మరోసారి చాటిచెప్పింది టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ. కొత్తగూడెం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ టెంపుల్ పరిధిలోని మెయిన్ బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీస్ పరిధిలో ఉన్న బర్మా క్యాంప్ లోని శ్రీ జ్యోతి వృద్ధులు మరియు వికలాంగుల అనాథాశ్రమం వరకు ద్విచక్ర వాహనాలపై భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా టాటా రతన్ సమాజ సేవలు, మానవత్వ విలువలు గురించి ప్రజలకు వివరిస్తూ ఆశ్రమం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం శీతాకాలంలో చలితో ఇబ్బంది పడుతున్న వృద్ధులు, వికలాంగులకు దుప్పట్లు (రగ్గులు) మరియు దుస్తులు పంపిణీ చేశారు.

అనంతరం ఆశ్రమంలోని వృద్ధులు, వికలాంగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న టాటా ఏఐఏ బ్రాంచ్ మేనేజర్ జక్కుల సతీష్ మాట్లాడుతూ,

“మీకు ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా తక్షణమే మేము అండగా ఉంటాం” అని భరోసా ఇచ్చారు.

ఇదే సందర్భంగా వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతి నెల రూ.2000 చొప్పున తాను ఉన్నంతవరకు అందజేస్తానని జక్కుల సతీష్ ప్రకటించారు. అలాగే లీగల్ అడ్వైజర్ కొచ్చర్ల కమల రాణి మాట్లాడుతూ, వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రతి నెల రూ.1000 అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొర్ర రాములు,జరుపుల సుధాకర్, కొచ్చెర్ల కమలారాణి, శివప్రసాద్, మహేష్ వాంకుడోత్,దేవరం జాడి సుమన్ నాగేంద్ర రెడ్డి,విజయ్ కావేటి  వాంకుడోత్ సురేష్ అడపా దివ్య  శివలీలా వరాల వీరన్న ఈ కార్యక్రమం సేవాభావం, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభినందనలు తెలిపారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >