| Daily భారత్
Logo




ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలి : రూరల్ ఎం ఎల్ ఏ డాక్టర్ భూపతిరెడ్డి

News

Posted on 2026-01-10 17:30:10

Share: Share


ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలి : రూరల్ ఎం ఎల్ ఏ డాక్టర్ భూపతిరెడ్డి

సావిత్రిబాయి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి

 డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఉద్యోగ–ఉపాధ్యాయ పురస్కారాలు–2026 కార్యక్రమం శనివారం నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ—మహిళా విద్యకు మార్గదర్శకురాలైన సావిత్రిబాయి పూలే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఆరోగ్యం, యువత నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని గుర్తుచేశారు.

0–3 ఏళ్ల చిన్నారులకు పౌష్టికాహారం, ప్రీ-ప్రైమరీ స్కూళ్ల ఏర్పాటు, యువత కోసం స్కిల్ యూనివర్సిటీ, మహిళల కోసం మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం ప్రభుత్వ సంకల్పమని అన్నారు. గేమ్స్, జోన్-స్థాయి టోర్నమెంట్ల ద్వారా యువతను ఆరోగ్యవంతంగా ఉంచే చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు పోటీగా నిలుస్తున్నాయని, పదో తరగతి ఫలితాల్లో శాతానికి శాతం ఉత్తీర్ణత రావడం గర్వకారణమని అన్నారు.

మహిళలకు వడ్డీరహిత రుణాలు, ఉపాధ్యాయ నియామకాలు, గృహ నిర్మాణ పథకాలపై ప్రభుత్వ కట్టుబాటు కొనసాగుతోందని వెల్లడించారు.

కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్, నాయకులు నరాలు సుధాకర్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీఈఓ అశోక్, మాజీ జెడ్పీ చైర్మన్ విట్టల్ రావు, కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న, రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >